సిమెంట్ సరఫరాలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన భారతి సిమెంట్ ,కాంకర్ గ్రూప్
మన దేశంలోనే తొలిసారిగా రైళ్ల ద్వారా బల్క్ సిమెంట్ సరఫరా
ఇందుకుగానూ కస్టమైజ్డ్ ట్యాంక్ కంటైనర్లు, బాక్స్ కంటైనర్స్ విత్ లైనర్స్ వినియోగం
భారతి సిమెంట్ & కాంకర్ కు సహకారాన్ని అందిస్తున్న భారతీయ రైల్వే
కడప, ఏప్రిల్-2022:
సిమెంట్ ఉత్పత్తి, సరఫరాలో రారాజుగా వెలుగొందుతున్న ఫ్రెంచ్ దిగ్గజ కంపెనీ వికాట్ గ్రూప్ మరో ముందుడుగు వేసింది. ఏడాదికి 8.6 మిలియన్ టన్నుల సామర్థ్యంతో గత 12 ఏళ్లుగా భారత్ లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ సంస్థ … సిమెంట్ సరఫరా కోసం సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది. రైళ్ల ద్వారా తొలిసారిగా బల్క్ సిమెంట్ సరఫరాకు శ్రీకారం చుట్టింది. ఇందుకుగానూ కస్టమైజ్డ్ ట్యాంక్ కంటైనర్లు, బాక్స్ కంటైనర్స్ విత్ లైనర్స్ ను వినియోగిస్తోంది. సిమెంట్ సరఫరాకు గానూ వికాట్ గ్రూప్ నకు … కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (కాంకర్), భారతీయ రైల్వే తమ సహకారాన్ని అందిస్తున్నాయి. రైళ్ల ద్వారా బల్క్ సిమెంట్ సరఫరా చేయడం మన దేశంలో ఇదే తొలిసారి కావడం విశేషం.
నాణ్యమైన సిమెంట్ కు కేరాఫ్ గా నిలుస్తున్న భారతి సిమెంట్ … వికాట్ గ్రూప్ జాయింట్ వెంచర్ అన్న సంగతి తెలిసిందే. సిమెంట్ రంగంలో భారతి సిమెంట్ ఒక సంచలనం. సుపీరియర్ క్వాలిటీ సిమెంట్ కు నిదర్శనం. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ ఈ కంపెనీ సొంతం. శరవేగంగా లోడ్ ను డెలివరీ చేయడంలో భారతి సిమెంట్ కు సాటి మరొకటి లేదు. ఆర్డర్ చేసిన 24 గంటల్లోగా సిమెంట్ గమ్యస్థానానికి చేరుతుందంటే … భారతి సిమెంట్ వినియోగించే రవాణా వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రైళ్ల ద్వారా బల్క్ సిమెంట్ సరఫరా ఇప్పుడు దీనికి జత చేరింది. కస్టమైజ్డ్ ట్యాంక్ కంటైనర్లు, బాక్స్ కంటైనర్స్ విత్ లైనర్స్ వినియోగంతో సిమెంట్ రవణా మరింత వేగంగా జరుగనుంది. తమకు కీ మార్కెట్ గా ఉన్న చెన్నై, సౌత్ వెస్ట్ తమిళనాడు & కేరళకు … కడప ప్లాంట్ నుంచి ఈ నూతన సరఫరా విధానం ద్వారా సిమెంట్ రవాణా చేయాలని భారతి సిమెంట్ యోచిస్తోంది. కొత్త లాజిస్టిక్ మోడల్ లో భాగంగా భారతి సిమెంట్ …. కడప ప్లాంట్ నుంచి 20 ఫీట్ ట్యాంక్ కంటైనర్లలో బల్క్ సిమెంట్ ను కోయంబత్తూర్ కు సరఫరా చేసింది. దీనికిగాను కాంకర్ సప్లై చేసిన రేక్స్ ఎంతో ఉపయోగపడ్డాయి.
కేరళ, సౌత్ వెస్ట్ తమిళనాడు మార్కెట్ పై భారతి సిమెంట్ మరింత దృష్టి సారించిందని భారత్ లో వికాట్ గ్రూప్ సీఈవో అనూప్ కుమార్ సక్సేనా తెలిపారు. ఇందుకుగానూ కోయంబత్తూర్ లో ప్రత్యేకంగా ప్యాకేజింగ్ టర్మినల్ ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. బ్యాగేజ్డ్, బల్క్ సిమెంట్ సరఫరాకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇందుకుగానూ భారతి సిమెంట్ రూ. 130 కోట్లు వెచ్చిస్తోందని వెల్లడించారు. కంటైనర్ల కొనుగోలుతో పాటు పూర్తి ఆటోమేటిక్ గా టర్మినల్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ మొత్తాన్ని వినియోగిస్తున్నామని అనూప్ కుమార్ సక్సేనా వివరించారు.
భారతి సిమెంట్ కు లాజిస్టిక్ కాస్ట్ తగ్గించేందుకు … కొత్తగా వినియోగిస్తున్న సరఫరా విధానం ఉపయోగపడుతుందని అనూప్ కుమార్ సక్సేనా తెలిపారు. అంతేకాకుండా కర్బన ఉద్గారాలను కూడా తగ్గిస్తుందని చెప్పారు. రాబోయే రోజుల్లో వినియోగదారులకు అందించే సేవలను మరింత మెరుగుపరుస్తామని వెల్లడించారు. సిమెంట్ సరఫరాలో దూసుకుపోతున్న భారతి సిమెంట్ కు కొత్త లాజిస్టిక్ విధానం అదనపు బలాన్ని ఇస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.
భారతి సిమెంట్ & కాంకర్ గ్రూప్ అనుసరిస్తున్న నూతన సరఫరా విధానం … మన దేశంలో సిమెంట్ బల్క్ ట్రాన్స్ పోర్ట్ విభాగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని అనూప్ కుమార్ సక్సేనా ఆశాభావం వ్యక్తం చేశారు. సిమెంట్ సరఫరాలో ఇది నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని చెప్పారు. వినియోగదారులకు మరింత త్వరగా, సమర్థవంతంగా లోడ్ ను డెలివరీ చేసేందుకు దీని ద్వారా వీలుకలుగుతందని చెప్పారు. సిమెంట్ లాజిస్టిక్స్ లో ఇదొక వినూత్నమైన ఆలోచన అని కొనియాడారు. మరింత సమర్థంగా, పర్యావరణ హితంగా సిమెంట్ సరఫరా చేసేందుకు భారతి సిమెంట్… ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో ముందుకు వస్తుందని పేర్కొన్నారు. తమకు సహకారాన్ని అందిస్తున్న కాంకర్ గ్రూప్, భారతీయ రైల్వేకు కృతజ్ఞతలు తెలిపారు.
భారతి సిమెంట్ ఎర్రగుంట్ల ప్లాంట్ నుంచి తొలి రేక్ ను అనూప్ కుమార్ సక్సేనా (భారత్ లో వికాట్ గ్రూప్ సీఈవో) జెండా ఊపి ప్రారంభించారు. భారతి సిమెంట్ డైరెక్టర్లు ఎం. రవీందర్ రెడ్డి, జి. బాలాజీ, జె.జె రెడ్డి, హరీష్ కామర్తి, ఎరిక్ తో పాటు ఆర్. ధనుంజయులు (పి.సి.ఒ.ఎం – సౌత్ సెంట్రల్ రైల్వే), జాన్ ప్రసాద్ (పి.సి.సి.ఎం – సౌత్ సెంట్రల్ రైల్వే), శేషగిరి రావు (ఈడీ – కాంకర్), సాయి రమేష్, ప్రవీణ్ గార్గ్ (భారతి సిమెంట్) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మరోవైపు, ఢిల్లీ నుంచి సంజయ్ మొహంతి (మెంబర్ ఆపరేషన్ & బిజినెస్ డెవలప్ మెంట్, రైల్వే బోర్డు), వి. కళ్యాణ రామ (ఎండీ – కాంకర్) … రేక్ ను డిజిటల్ గా ప్రారంభించారు.