మద్యం ప్రియులకు శుభవార్త
తెలంగాణ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలోని అన్ని బ్రాండెడ్ బీర్లపై పది రూపాయలు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో కరోనా కారణంగా గత ఏడాది బీర్ల సేల్స్ తగ్గిపోయింది .తిరిగి సేల్స్ పెంచుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి అన్ని రకాల బీర్లు పై పది రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.