అందంతో మ‌న ఆత్మ‌విశ్వాసం పెంపొందుతుంది : వెర్నాన్ అడ్వాన్స్డ్ స్కిన్ అండ్ హెయిర్ క్లీనిక్ ప్రారంభోత్స‌వంలో సుమ క‌న‌కాల‌

హైద‌రాబాద్ బంజారాహిల్స్,

మ‌న ఆహార్యం మ‌న‌లోని ఆత్మ‌విశ్వాసాన్ని తెలియ‌జేస్తుంద‌ని సినీన‌టి, ప్ర‌ముఖ వ్యాఖ్య‌త‌ సుమ క‌న‌కాల అన్నారు .హైద‌రాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబ‌రు 2లో నూత‌నంగా ఏర్పాటుచేసిన వెర్నాన్ అడ్వాన్స్డ్ స్కిన్ అండ్ హెయిర్ క్లీనిక్ ఆమె ముఖ్యఅతిధిగా హాజ‌రై ప్రారంభించారు .బ్యూటీ ప‌రిశ్ర‌మ‌లో ఎప్ప‌టిక‌ప్పుడు మార్పులు చోటుచేసుకొంటున్నాయని… ఎలాంటి దుష్ప‌రిణామాలు లేకుండా ఈ సేవలు అందిస్తున్న సంస్థ‌లు మ‌నుగ‌డ సాధిస్తాయ‌న్నారు. ప్ర‌ధానంగా జుత్తు, సౌంద‌ర్య‌పోష‌ణ విష‌యంలో చాలా మంది ఇప్పుడు ఆస‌క్తి చూపుతున్నారని తెలిపారు . సినిమా ప‌రిశ్ర‌మ‌, అందాల ప‌రిశ్ర‌మ‌, ఫ్యాష‌న్ ఇండ‌స్ట్రీల‌తో పాటు నేటి యువ‌త సౌంద‌ర్యానికి మెరుగులు దిద్దే ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చేయ‌డం ఎంతో అవ‌స‌రమ‌న్నారు .

మారుతున్న బ్యూటీ రంగానికి అనుగుణంగా వైద్య చికిత్స‌, సాంకేతిక ప‌ద్ద‌తులు వినియోగిస్తున్న‌ట్లు
సుప్రసిద్ధ సౌందర్యం, చర్మం , జుట్టు సంరక్షణపుణుడు, వెర్నాన్ నిర్వాహ‌కులు డాక్టర్. ఆర్ బ్రహ్మనాద రెడ్డి తెలిపారు . వెర్నాన్ ఇంటీరియర్ సౌందర్యం మాత్రమే కాకుండా వ‌చ్చే అతిథుల‌ను ఆహ్లాదంగా ఉంచడానికి ఈ కేంద్రం ప్ర‌త్యేకంగా తీర్చిదిద్దిన‌ట్లు ఆయ‌న తెలిపారు. లేజర్ హెయిర్ రిడక్షన్, పిగ్మెంటేషన్, యాక్నే & స్కార్ ట్రీట్‌మెంట్, పిఆర్‌పి హెయిర్ రిజువెనేషన్, పిఆర్‌పి స్కిన్ రిజువెనేషన్, యాంటీ ఏజింగ్, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సేవ‌లు అందిస్తున్నామ‌న్నారు. వీటితో పాటు టాటూ రిమూవల్, బోటాక్స్, ఫిల్లర్స్, నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్‌లు స్ట్రెచ్ మార్క్ ట్రీట్‌మెంట్, ట్రీట్‌రాయిడ్ ట్రీట్‌మెంట్ మొటిమ‌లు, స్కిన్ ట్యాగ్ తొలగింపు చికిత్స‌ల‌ను ఇక్క‌డ అందిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *