తెలుగు జీవన శైలికి ప్రతిరూపం బాపు రమణ : మామిడి హరికృష్ణ
హైదరాబాద్, తెలుగు యూనివర్సిటీ
తెలుగు జీవన శైలికి ప్రతిరూపం బాపు రమణలు అని తెలంగాణ భాషా సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ అన్నారు .హైదరాబాద్ నాంపల్లి తెలుగు యూనివర్సిటీ స్వర్గీయ ఎన్టీరామారావు ఆడిటోరియంలో బాపు రమణ అకాడమి హైదరాబాద్ ,ఆత్రేయపురం ఆధ్వర్యంలో పద్మశ్రీ బాపు రమణ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు

బాపు రమణ పేరిట నెలకొల్పిన పురస్కారాల్లో … ప్రముఖ కార్టునిస్ట్ క్యారికేచరిస్టు పామర్తి శంకర్ కు బాపు పురస్కారాన్ని, రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మికి రమణ పురస్కారాలను అందించారు.


సినిమాలను సిలిబస్ గా తీసుకువచ్చిన ఘనత బాపుదని మామిడి హరికృష్ణ అభివర్ణించారు. అక్షరాన్ని రచించడం రమణ వంతు అయితే …దాన్ని అదే స్థాయిలో చూపించడం బాపు ఘనత అని అన్నారు. తెలుగు సినీ చరిత్రలో బాపు రమణలు తనదైన ముద్ర వేశారని తనికెళ్ళ భరణి అన్నారు.
ప్రముఖ కథారచయిత ముళ్ళపూడి వెంకట రమణ మణ రచించిన కథా సంకలనాలు సీతా కల్యాణం,రాధా గోపాలం కథలు, కార్టునిస్ట్ రామకృష్ణ ఫౌండేషన్ రూపొందించిన మొదటి నవ్వుల విందు హాస్యకదంబం రాగతి పండరి కార్టూన్ల సంకలనాలను వక్తలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు తనికెళ్ళ భరణి నటులు విజయ్ చందర్ ,గాయిని సునీతప్రముఖ వైద్యులు గురువారెడ్డి, బాపు రమణ అకాడమి కార్యదర్శి వేగిరాజు సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు .