బంజారాల బతుకమ్మ తీజ్ పండుగ: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్

హైదరాబాద్,మియాపూర్

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియాపూర్ డివిజన్ నడిగడ్డ తాండ గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన తీజ్ ఉత్సవాలు పండుగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

ఈ తీజ్ పండుగకు ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ తో పాటు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రంగారెడ్డి ప్రధాన కార్యదర్శి దశరథ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 ఏండ్ల చరిత్రగల తీజ్ పండుగ రాను రాను మరింత ఆదరణ పెరుగుతుందన్నారు. సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా తమ పండుగలను ఎంతో ఘనంగా జరుపుకుంటామని వారు తెలిపారు. పండుగ రోజు సందర్భంగా తమ బంధువులందరిని ఆహ్వానించి బంజారా సాంప్రదాయ నృత్యాలతో తీజ్ పండుగను నిర్వహించుకున్నారు. ఆరాధ్య దైవమైన శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్,జగదాంబ యాడి ఆశీస్సులతో పవిత్రమైన పూజ చేస్తూ పండుగలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వ్రతం బంజారా యువతీలు ఆనందోత్సాహాలతో చేసుకునే పండుగ అని అన్నారు. వ్రతాన్ని పెళ్లి కాని యువతులు అత్యంత వైభవంగా శ్రావణమాసంలో మొదలు పెట్టి 9 రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు. అడవి నుంచి తెచ్చిన స్వచ్ఛమైన పుట్ట మట్టిని గోధుమలు చల్లి 9 రోజులు నీరు పోస్తూ మొలకలు వచ్చిన తరువాత మొక్కల బుట్ట తో నీళ్లు ఉన్న చెరువులో బంజారా ఆడపిల్లలు నృత్యాలు చేస్తూ నీళ్లు పోస్తారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ తండా అధ్యక్షులు తిరుపతి నాయక్,ప్రధాన కార్యదర్శి రత్నకుమార్ మరియు సీతారాం నాయక్ ,మధుసూదన్,రెడ్యానాయక్, శంకర్ నాయక్ హన్మ, ఆంజనేయులు గోపీనాయక్ ,చందు యాదవ్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *