కార్పోరేటర్ విజయారెడ్డి పట్ల సీఐ దురుసు ప్రవర్తన….ఆందోళనకు దిగిన విజయారెడ్డి
హైదరాబాద్
తమ పట్ల సీఐ దురుసుగా ప్రవర్తించారని కార్పొరేటర్ విజయారెడ్డితో పాటు ఆమె అనుచరులు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.సీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐ క్షమాపణ చెప్పాలని విజయారెడ్డి డిమాండ్ చేశారు. సీఐ ఎవరి డైరెక్షన్‌లో పనిచేస్తున్నారని నిలదీశారు. ప్రజలు, పోలీసులు ఒకరికి ఒకరు సహకరించుకోవాలన్నారు.

వ్యక్తిగతం తమను సీఐ టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. సీఐ తన పద్దతి మార్చుకోవాలని విజయారెడ్డి హెచ్చరించారు. కార్పొరేటర్‌కే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడే కూర్చుంటామని పోలీస్‌స్టేషన్ ఎదుట అనుచరులతో విజయారెడ్డి భీష్మించుకు కూర్చున్నారు.