అజారుద్దీన్ తండ్రి మహమ్మద్‌ యూసుఫ్‌ కన్నుమూత

హైదరాబాద్ ,బంజారాహిల్స్

భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్​, హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి మహమ్మద్‌ యూసుఫ్‌ కన్నుమూశారు.

సుదీర్ఘకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన ఇటీవలే తీవ్ర అనారోగ్యానికి గురై కొన్ని రోజుల నుంచి ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంలో అజారుద్దీన్​ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

యూసుఫ్​ అంత్యక్రియలు బుధవారం బంజారాహిల్స్​లో నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *