ఉత్తమ ప్రతిభావంతులకు ఆగస్టు 14న శ్రీనిధి ఐకాన్ అవార్డుల ప్రధానోత్సవం

హైదరాబాద్

వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే వ్యక్తులు, సంస్థల పనితీరును బట్టి వారిని మరింత ఉత్తేజపరచడానికి ఐకాన్ అవార్డులతో ఘనంగా సత్కరించబోతున్నామని ఐకాన్ జాతీయ అధ్యక్షుడు, సీఈఓ డాక్టర్ దినేష్ మురుగేశన్ అన్నారు. సోమాజిగూడలోని పార్క్ హోటల్ లో శ్రీనిధి ఎడ్యుకేషన్ గ్రూప్ ఐకాన్ అవార్డుల కర్టెన్ రైజర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఐకాన్ వ్యవస్థాపకుడు క్రిష్ చింతలూరితో కలిసి ఆగస్టు 14 న జరగబోయే ఐకాన్ అవార్డుల ప్రధానోత్సవం వివరాలు ను వెల్లడించారు. విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులు కనెక్ట్ కావడానికి, సహకరించడానికి ,సృజనాత్మకంగా ఉండటానికి ఒక వేదికగా పనిచేయాలని మేం ఆశిస్తున్నామన్నారు.

ఐకెఒఎన్ వ్యవస్థాపకుడు, సిఒఒ క్రిష్ చింతలూరి మాట్లాడుతూ, మంత్రులు, సీనియర్ రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు, సీనియర్ విద్యావేత్తలు కొంతమంది ఇతర విఐపిలతో సహా అనేక మంది ప్రముఖ అతిథులను ఆహ్వానించామని చెప్పారు. ముఖ్య అతిథులచే అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం చేయనున్నామన్నారు, ఐకాన్ అవార్డుల టైటిల్ స్పాన్సర్ లుగా శ్రీనిధి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేసారు.

ఈ సంధర్భంగా శ్రీనిధి ఎడ్యుకేషన్ గ్రూప్ సిఈఒ కె. అభిజిత్ మాట్లాడుతు ఐకాన్ సంస్థకు మా సహకారాలు ఎప్పుడు ఉంటాయన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీనిధి ఎడ్యుకేషన్ గ్రూప్ ఎక్షిక్యుటివ్ డైరక్టర్ డాక్టర్ నరసింహరెడ్డి, ఐకాన్ అవార్డుల ఇతర స్పాన్సర్లుగా కార్పొరేట్ సర్వీసెస్ కాప్స్టన్ ఫెసిలిటీ ప్రెసిడెంట్ హరప్రసాద్ పాండా,ఆప్టిమస్ ఫార్మా మార్కెటింగ్ డైరెక్టర్ పి ప్రశంత్ రెడ్డి,లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ క్లబ్ మెంబర్ ఝ్శ్ మోహన్ రావు, శ్రీనిధి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ మార్కెటింగ్ డైరెక్టర్ శ్రీమతి మైత్రీ,అన్నమయ్య గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ప్లేస్ మెంట్ ఆఫీసర్ సునీల్ తదితరులు ఈ రోజు కర్టెన్ రైజర్ కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *