అమెరికాలో జులై 2022లో జరిగే ఆటా మహాసభలకు మెగాస్టార్ చిరంజీవి ని ఆహ్వానించిన ఆటా ప్రతినిధుల బృందం
అమెరికా తెలుగు సంఘం(ఆటా) ప్రతినిధులు ప్రముఖ సినీ నటులు మెగాస్టార్ చిరంజీవితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు.
ఆటా ప్రతినిధులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఆటా-చిరంజీవి రక్తనిధితో కలిసి కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు.
కోవిద్ సమయంలో ఆటా అందించిన సేవా కార్యక్రమాలను ఆటా అధ్యక్షులు భువనేష్ బూజాలా చిరంజీవికి వివరించారు. ఈ ఏడాది 2021 డిసెంబరులో జరిగే ఆటా వేడుకలకు హాజరు కావల్సిందిగా ఆయనను ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు. జులై 2022లో అమెరికాలో జరిగే ఆటా మహాసభలకు కూడా హాజరు కావల్సిందిగా వారు కోరారు.