హైదరాబాద్ సెప్టెంబర్ మూడున లీ మెరిడియన్ హోటల్ లో ఆస్త్ర కనెక్ట్ జాతీయ స్థాయి సదస్సు -ఫౌండర్ హబీబ్ సల్తాన్ అలీ
హైదరాబాద్ సెప్టెంబర్ మూడున లీ మెరిడియన్ హోటల్ లో ఆస్త్ర కనెక్ట్ జాతీయ స్థాయి సదస్సు -ఫౌండర్ హబీబ్ సల్తాన్ అలీ
హైదరాబాద్ ,జూబ్లీహిల్స్
పేదలకు న్యాయం అందించేందుకు ఆస్త్ర సంస్థ కృషి చేస్తుందని ఫౌండర్ హబీబ్ సుల్తాన్ అన్నారు .హైదరాబాద్ లీ మెరిడియన్ హోటల్ లో సెప్టెంబర్ 3 వ తేదీన జరగనున్న ఆస్రా జాతీయ స్థాయి సదస్సుకు సంబంధించిన బ్రోచర్ ను ఆవిష్కరించారు .ఈ సదస్సులో దేశంలోని తొమ్మిది రాష్ట్రాల నుంచి న్యాయవాదులు, సామాజిక వేత్తలు పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. వినియోగదారుల చట్టం వచ్చినప్పటి నుంచి అది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎంతమందికి సేవలు అందించారనే విషయంలో సమగ్ర చర్చ జరుగుతుందన్నారు . చట్టంప్రకారం అన్ని కోర్టుల్లో కమిషన్లు వేయాల్సి ఉన్నప్పటికీ దేశంలోని చాలా కోర్టులలో ఆ వ్యవస్థ లేదని దానికోసం ఎలా ముందుకు వెళ్లాలని విషయంలో చర్చిస్తామని తెలిపారు..
ఈ సదస్సులో జాతీయ కమిషన్ అధ్యక్షులు అగర్వాల్, మంత్రులు మహమూద్ అలీ, గంగుల కమలాకర్ పాల్గొంటారని తెలిపారు.ఆస్త్ర ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలు, అందించిన సేవలతోపాటు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల మీద చర్చిస్తామని హబీబ్ సుల్తాన్ తెలిపారు.