బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన రంగా : వెలంపల్లి
సితార సర్కిల్ కు వంగవీటి మోహన రంగా జంక్షన్ గా నామకరణం
విజయవాడ అక్టోబర్ 16
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా స్వర్గీయ వంగవీటి మోహన రంగా ప్రజల హృదయాల్లో నిలిచి ఉన్నారని,తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన నేత వంగవీటి మోహన రంగా అని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఉదయం స్థానిక 44, 45 డివిజన్ల మధ్యలో ఉన్న సితార సెంటర్ కు వంగవీటి మోహన రంగా జంక్షన్ గా నామకరణం తో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బోర్డును ఎమ్మెల్యే వెలంపల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడిన రంగా స్ఫూర్తితో సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని వివరించారు.
సితార సెంటర్ కు విఎం రంగా జంక్షన్ గా నామకరణం చేయడంతో పాటుగా ఈ సెంటర్లో రంగా విగ్రహాన్ని త్వరలో నెలకొల్పనున్నట్లు ఆయన వెల్లడించారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పేద ప్రజల కోసం స్వర్గీయ వంగవీటి మోహన రంగా అహర్నిశం కృషి చేశారని కొనియాడారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా ఆశయాలు సాధనకై తాము కృషి చేస్తున్నామని చెప్పారు. స్థానిక 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి, 45వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల నాయకుడైన వంగవీటి మోహన రంగా పేరును నియోజకవర్గంలో ప్రధానమైన సితార సెంటర్ కు పెట్టడం ఎంతో సంతోషమన్నారు.విఎం రంగా పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. కాగా కీలకమైన ఈ జంక్షన్కు వంగవీటి మోహన్ రంగ జంక్షన్ గా నామకరణం చేయించడం పట్ల స్థానిక కార్పొరేటర్లు రత్నకుమారి, మాధురీ లావణ్యలను స్థానికులు ప్రశంసలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అత్తులూరి ఆదిలక్ష్మి, మహదేవ్ అప్పాజీ, యలకల చలపతిరావు,సింహాచలం బోర్డు నెంబర్ కురాకుల నాగ,వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ దేరంగుల రమణ,శ్రీశైలం బోర్డు మెంబర్ జి.మహేష్,ఎస్.వి.రంగారావు కాపు సంఘ అధ్యక్షులు పేర్ల శ్రీనివాసరావు, కాపునాడు అర్బన్ అధ్యక్షుడు యర్రంశెట్టి అంజిబాబు, మైలవరపు కృష్ణ, మైలవరపు దుర్గారావు,అత్తులూరి పెద్దబాబు,విశ్వనాథ రవి,రాయన నరేంద్ర, వీరంకి సత్యనారాయణ,వడ్లాని మాధవరావు,నారిండి బ్రదర్స్, అంకన నాగరాజు,ముత్త వాసు,రెడ్డిపల్లి రాజు,బోండా సాంబశివరావు,అలుమూరి సాంబ,దావల బుజ్జి,దబ్బాడా రాము,ముక్క రమణ,బావిశెట్టి వాసు,ఋషి,ముత్యాల రాంబాబు,పీతల నాగు,బైపిళ్ల కోటేశ్వరరావు, ఐతా కిషోర్,వల్లం రవి కుమార్,దొడ్ల రాజా,కర్రీ గౌరి, పడాల రాజేష్,కంచిబాబు,వెన్నం రజిని,పిడుగు దుర్గారావు, పలువురు కాపు నాయకులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.