ఫోర్బ్స్ మ్యాగజైన్ లో డాక్టర్ కేర్ హోమియోపతి ఫౌండర్ డాక్టర్ ఏఎం రెడ్డిపై కథనం

హైదరాబాద్

తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం లభించింది . తెలుగు రాష్ట్రాల్లో అటిజంతో భాదపడుతున్న చిన్నారులకు హోమియోపతి వైద్యం ద్వారా నయం చేసిన డాక్టర్ కేర్ హోమియోపతి ఫౌండర్ డాక్టర్ ఏఎం రెడ్డి సేవలను ఫోర్బ్స్ మ్యాగజైన్ గుర్తించింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ మొదటి పేజిపై ఫోటోను ప్రచురించడంతో పాటు ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది . వందల సంఖ్యలో అటిజం కేసులను ఎంతో గొప్పగా ట్రీట్ చేసి 20 ఇన్ క్యూరబుల్ అటిజం కేసులను ఫోర్బ్సు మ్యాగజైన్ కు పంపించారు. దీంతో మ్యాగజైన్ యాజామాన్యం  ఏఎం రెడ్డి అందిస్తున్న సేవలను గుర్తించింది. ప్రపంచంలో నెంబర్ వన్ ఎంటర్ప్రెన్యూర్ మ్యాగజైన్ అయినటువంటి ఫోర్బ్స్ మ్యాగజైన్ లో ప్రత్యేక కథనం  రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని డాక్టర్ ఏఎం రెడ్డి తెలిపారు. అటిజం లేని సమాజాన్ని తయారు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఆయన తెలిపారు.

చిన్నారిని పిలిచినా కదలికలు లేకపోవడం …ఏదో పరధ్యానంలో ఉండటం లాంటి మానసిక రుగ్మతలు అటిజంగా చెప్పవచ్చుని డాక్టర్ ఏఏం రెడ్డి తెలిపారు. ముద్దు ముద్దు మాటలు మాట్లాడాల్సిన పిల్లలు ఉలుకు పలుకూ లేక ఏదోలోకంలో ఉన్నట్లు ఉంటున్నారని … ఇలాంటి పిల్లల సంఖ్య రోజురోజూకు పెరుగుతుంటం ఆందోళన కరంగా మారిందన్నారు . ప్రపంచంలో ప్రతి పది వేల మంది చిన్నారుల్లో ఇద్దరు అటిజంతో బాధపడుతున్నారని చెప్పారు . తెలుగు రాష్ట్రాల్లోనూ అటిజం కేసుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు.  తల్లిదండ్రులు ఇలాంటి విషయాలను నిర్లక్ష్యం చేస్తే…..వారి భవిష్యత్ అదుపుతప్పుతుందని హెచ్చరించారు.

వంశ పారపర్యంగా, మేనరికపు వివాహాలు చేసుకోవడం ద్వారా, తల్లులు గర్భాధారణ సమయంలో అత్యధికంగా మందులు వినియోగించడం తదితర కారణాల వల్ల  అటిజం గల శిశువులు పుడుతున్నారని డాక్టర్ ఏఎం రెడ్డి తెలిపారు.  


ఇలా అటిజంతో బాధపడుతున్న చిన్నారులకు   జెనెటిక్ మెడికేషన్ విధానం ద్వారా , ఇమ్మునిటీ , ఇమ్మునోథెరఫీ ద్వారా  ఆటిజం ను తగ్గించవచ్చున్నారు డాక్టర్ A M రెడ్డి.  హోమియోపతిలో ఇమ్యూనో థెరిపి ద్వారా ఆటిజంను తగ్గించవచ్చని తెలిపారు.  తన ట్రీట్మెంట్ ద్వారా ఎంతో మంచి  ఫలితాలు వచ్చాయని … పిల్లల తల్లిదండ్రులకు  ఎంతో సంతోషకరమైన విషయమన్నారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *