వ‌యో వృద్దుల సంర‌క్ష‌ణ కోసం చిత్త వైక‌ల్యం సంర‌క్ష‌ణ ప‌థ‌కంను ప్రారంభించిన అన్వ‌య అంకుర సంస్థ‌

హైద‌రాబాద్ ,బేగంపేట్

డెమిన్టియా( పీడ‌బ్యూడీ ) సంర‌క్ష‌ణ ప‌థ‌కం లోగోను ఆవిష్క‌రించిన ద‌ర్శ‌కులు మారుతి, న‌టుడు అశ్విన్ విరాజ్

వ‌యోవృద్దుల సంర‌క్ష‌ణ సేవ‌లు అందిస్తున్న హైద‌రాబాద్ స్టార్ట‌ప్ సంస్థ అన్వ‌య … కొత్త సేవ‌ల‌కు శ్రీకారం చుట్టింది. డెమిన్టియా( పీడ‌బ్యూడీ )వ్యాధితో బాధ‌ప‌డుతున్న వృద్దుల‌కు అండ‌గా ఉండేందుకు ముందుకు వ‌చ్చింది. విదేశాల్లో స్థిర‌ప‌డిన ప్ర‌వాస భార‌తీయులు , వివిధ రాష్ట్రాలు ,దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి సీనియ‌ర్ కేర్ ప్లాన్ చ‌క్క‌టి వ‌రంలాంటిద‌ని సినీ ద‌ర్శ‌కులు వీఎన్ ఆదిత్య అన్నారు

అన్వ‌య సంస్థ చేప‌డుతున్న సేవ‌ల‌నే క‌థాంశంగా తీసుకుని చిత్రాన్ని నిర్మిస్తున్న‌ట్లు వీఎన్ ఆదిత్య తెలిపారు. దేశ విదేశాల్లో స్థిర‌ప‌డిన భార‌తీయులు …వారి త‌ల్లిదండ్రులను స్వ‌దేశంలోనే ఉంచుతున్నార‌ని తెలిపారు. వ‌యో వృద్దులైన త‌ల్లిదండ్రుల‌ను అనాధశ్ర‌మాల్లో ఉంచ‌కుండా…ఇంట్లోనే కేర్ టేక‌ర్ల‌ను నియమించి…వారికి కావాల్సిన వైద్య సేవ‌లు, ఇత‌ర అవ‌స‌ర‌మై సేవ‌ల‌ను అన్వ‌య స్టార్టప్ కంపెనీ అందించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు .తాను సైతం విదేశాల్లో ఉన్న కుటుంబాల‌కు ఈ సంస్థ అందిస్తున్న సేవ‌ల‌ను వివ‌రించాని మారుతి చెప్పుకొచ్చారు. ఇదే కాన్సెఫ్ట్ తో చిత్రాన్ని తీశాన‌ని… ఈ సినిమా త్వ‌ర‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంద‌ని తెలిపారు .

న్యూరో డీజనరేటివ్‌ డిజార్డర్‌ డెమిన్టియాతో బాధ పడుతున్న పెద్దల అవసరాలను తీర్చే సంరక్షణ ప్రణాళిక అని అన్వ‌య ఫౌండర్ ప్ర‌శాంత్ రెడ్డి తెలిపారు . డెమిన్టియాతో బాధపడుతున్న వ్యక్తులలో జ్ఞాపక శక్తి, ఆలోచనా సామర్థ్యం, నిర్ణయాలను తీసుకునే శక్తి, తీర్పు మొదలైనవి క్ర‌మంగా క్షీణిస్తాయ‌న్నారు. చివరకు శారీరకంగా కూడా కూడా ప్రభావితమవుతుందన్నారు. డెమిన్టియా రోగుల కోసం వ్యక్తిగతీకరించిన సంరక్షణను అందించేందుకు వారు గౌరవింగా జీవించడానికి అన్వయా కేర్ ప్లాన్ ను సిద్దం చేసింద‌ని వివ‌రించారు.

కృత్రిమ మేథస్సు వినియోగించి తీర్చిదిద్దిన సృజనాత్మక సాంకేతిక వేదిక తో కేర్‌ ప్లాట్‌ఫామ్ సిద్దం చేసిందన్నారు. సంరక్షణ ఇచ్చే వారికి పీడబ్ల్యుడీ అర్థవంతంగా నిమగ్నమై ఉండేలా చూసుకునే సామర్థ్యాన్ని అందించడం ద్వారా నిరంతరం మార్గనిర్దేశం చేస్తుందని వెల్ల‌డించారు. ఈ ప్లాట్‌ఫామ్‌ డెమెన్టియా ఉన్న స్ధితి ఆధారంగా తగిన కార్యకలాపాలను స్వయం చాలకంగా సూచిస్తుందని.. వారి శారీరక, భావోద్వేగ మరియు అభిజ్ఞా సంక్షేమం పెంచడానికి తగిన దిశలను సూచిస్తుందన్నారు. దీనికి సుశిక్షితులైన క్లీనీషియన్స్ , కేర్‌ మేనేజర్లు తో కూడిన నెట్‌వర్క్ అందిస్తుంద‌ని ఆయన తెలిపారు .

వృద్దుల‌కు వయసుతో పాటుగా డెమిన్టియా స్ధితి వృద్ధి చెందుతుందని.. అయితే 65 సంవత్సరాలకు పైబడిన వయసు వ్యక్తులలో డెమిన్టియా కేసులుకనబడుతుంటాయన్నారు. ఓ వ్యక్తి రోజువారీ కార్యకలాపాలలో సైతం ఆటంకం కలిగిస్తుందని.. వ్యక్తులను బట్టి వ్యక్తుల లక్షణాలలో సైతం ఇది విభిన్నంగా కనిపిస్తుంద‌న్నారు. కాబట్టి రోగి యొక్క స్ధితి పర్యవేక్షణ , ట్రాకింగ్‌ కోసం సాంకేతికతను వినియోగిస్తున్నామ‌న్నారు. ఈ కారణంగా మొత్తం కుటుంబానికి ఒత్తిడి , బాధను పెరుగుతుంద‌న్నారు. నిపుణులతో కూడిన సంరక్షణను వ్యక్తిగతీకరించడంతో పాటుగా ఇప్పటికే జరిగిన నష్టాన్ని అడ్డుకుని వారి ప్రయాణం వీలైనంత సాఫీగా జరిగేలా భరోసా అందిస్తామ‌ని ప్ర‌శాంత్ రెడ్డి తెలిపారు.

కుటుంబంలోని వ్యక్తులపై భారం తగ్గించేలా అన్వ‌య సంస్థ కేర్ ప్లాన్ ను త‌యారు చేసింద‌ని ప్ర‌శాంత్ రెడ్డి తెలిపారు . జీవిత నాణ్యత మెరుగుపరచడంతో పాటుగా వ్యక్తిగతీకరించిన ప్యాకేజీలు అందిస్తున్న‌ట్లు తెలిపారు. డెమిన్టియా సైకాలజిస్ట్‌లు, న్యూరాలజిస్ట్‌లు, సైక్రియాటిస్ట్‌లతో కౌన్సిలింగ్ ఇప్పించి ఆరోగ్య స‌మ‌స్య‌ల వివ‌రాల‌ను తెలుసుకుంటామ‌ని తెలిపారు . ప్రత్యేకంగా శిక్షణ పొందిన కేర్‌ మేనేజర్లు , కేర్‌ గివర్లను నియమించుకున్నామ‌న్నారు. అన్వయా డెమిన్టియా కేర్‌ ప్లాన్‌లో ప్రత్యేకంగా ఓ డైట్‌ ప్లాన్‌ను సైతం జోడించామ‌ని.. ఇది అభిజ్ఞా ప్రక్రియ, ఆరోగ్యం మెరుగుపరుస్తుందన్నారు. వీటితో పాటుగా అన్వయా విశ్వసనీయతతో కూడిన రక్షణను రోగులకు అందుతుంద‌ని తెలిపారు . డెమిన్టియాతో బాధపడుతున్న పెద్దలకు అత్యుత్తమంగా సేవలనందించేందుకు , వారి కుటుంబ సభ్యులకు అత్యుత్తమంగా రోగిని నిర్వహించేందుకు సహాయపడనుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *