హైదరాబాద్ బంజారాహిల్స్ లో గండికోట రెస్టారెంట్ ను ప్రారంభించిన ఏపీ శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి
హైదరాబాద్, బంజారాహిల్స్
హైదరాబాదీబిర్యానీ అంటే తనకు చాలా ఇష్టమని వైఎస్ఆర్ సీపీ నేత, స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దారెడ్డి అన్నారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన గండికోట రెస్టారెంట్‌ను ఆయన ప్రారంభించారు. గండికోట రెస్టారెంట్ పరిసరాలు అతిధులకు మరింత అదనపు ఆనందాన్ని, ఉల్లాసాన్ని అందిస్తాయన్నారు. విభిన్న రుచులకు రాజధాని అయిన హైదరాబాద్ లో గండికోట రెస్టారెంట్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఆకట్టుకునే ఇంటీరియర్స్, అత్యాధునిక లాంజ్ , అత్యంత రుచికరమైన ఇండియన్ కుజిన్స్ హైదరాబాదీయులకు మరింత చేరువచేస్తుందన్నారు.
రెస్టారెంట్ లో విద్యుత్ వెలుగులు ఆహ్లాదకరమైన అనుభవాన్ని ఇస్తాయని గండికోట రెస్టారెంట్ మేనేజింగ్ పార్ట్ నర్స్ సుధీర్, పవిత్ర దీక్షిత్ లు తెలిపారు. చక్కని వ్యూ, అద్బుతమైన పరిసరాలను అత్యంత రుచికరమైన ఆహారాన్ని అభిలషించే యువ నగరవాసులను దృష్టి లో ఉంచుకుని రూపుదిద్దు కుందన్నారు. వైవిద్యాన్ని కోరుకునే కస్టమర్లకు నిజమైన ఎంపికగా ఈ రెస్టారెంట్ అని వారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వర్ధమాన నటులు , మోడల్స్ సందడి చేశారు.