ఏపీ జగన్ జాగీరా..? నారా లోకేష్ విమర్శలు
ఏపీలో సభలు, సమావేశాలపై నిషేధం విధించడంపై… టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రాష్ట్రం నీ జాగీరా జగన్ రెడ్డి అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా ఎమర్జన్సీ విధించావా..? అంటూ నిలదీశారు. కుప్పంపై వైసీపీ పోలీసులు అప్రకటిత యుద్ధమే ప్రకటించారని విమర్శించారు. బ్రిటీష్ చట్టానికి బూజు దులుపి అర్ధరాత్రి జీవో ఎలా ఇస్తారంని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా.. చంద్రబాబుకు జనాదరణ ఇంకా పెరుగుతూనే ఉంటుందన్నారు.
