ఏపీ ఫైబర్‌నెట్‌లో అక్రమాలపై సీఐడీ విచారణ

చంద్రబాబు ప్రభుత్వం హయాంలో ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై సీఐడీ విచారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఫైబర్‌నెట్ టెండర్ల ఖరారులో కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించినట్లు గుర్తించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. టీడీపీ హయాంలో ఏపీ ఫైబర్‌నెట్‌ అక్రమాలకు నిలయంగా మారింది. టీడీపీ పెద్దల అండతో యథేచ్ఛగా అక్రమాలు జరిగాయని కాంట్రాక్టర్లకు గత టీడీపీ ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరించడంతో ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో నష్టం వచ్చినట్లు గుర్తించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *