టాలీవుడ్ లో మరో విషాదం..!
టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు చలపతిరావు గుండెపోటుతో తెల్లవారుజామున కన్నుమూశాడు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన.. సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. 1200కు పైగా సినిమాల్లో చలపతిరావు నటించారు. సినీ ఇండస్ట్రీలో చలపతిరావుకు విలక్షణ నటుడిగా పేరుంది. విలనిజం, పౌరాణిక పాత్రల్లో తనదైన మార్కు వేశారు. తర్వాతి కాలంలో తండ్రి, అన్న, తాత పాత్రలతో అలరించారు. 4 తరాల నటులతో తెరను పంచుకున్నారు. NTR, ANRలతోపాటు ఆ తర్వాత శోభన్బాబు, కృష్ణలతో కలిసి నటించారు. బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ చిత్రాల్లోనూ మంచి పాత్రలు పోషించారు.
