సుచిరిండియా నుంచి మరో కొత్త ప్రాజెక్ట్ ద టేల్స్ ఆఫ్ గ్రీక్

హైదరాబాద్

దేశంలోనే మొట్టమొదటి సారిగా ద టేల్స్ ఆఫ్ గ్రీక్ పేరుతో అఫర్టబుల్ లగ్జరీ అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నట్లు సుచిరిండియా ఛైర్మన్ డాక్టర్ లయన్ కిరణ్ కుమార్ తెలిపారు.హైదరాబాద్‌ షాద్‌నగర్‌ సమీపంలో
2.45 ఎకారాల విస్తీర్ణంలో 2 BHK స్టూడియో అపార్ట్‌మెంట్‌లు నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు .ఈ ప్రాజెక్ట్ హెచ్‌ఎండీ అఫ్రూవ్‌డ్ పొందిందని… దేశంలోనే మొట్టమొదటి ఐజీబీసీ సర్టిఫికేట్ పొందిన ప్రాజెక్ట్ సుచిరిండియా ద టేల్స్ ఆఫ్ గ్రీక్ అని డాక్టర్ లయన్ కిరణ్ కుమార్ తెలిపారు. హైవేకు అతిసమీపంలో ఈ ప్రాజెక్ట్‌ను తీసుకువచ్చామని… ఎంఎంటీఎస్‌ రైల్వే స్టేషన్‌కు రెండు నిమిషాల్లో చేరుకోవచ్చన్నారు. ఎయిర్ పోర్టు ఐదు నిమిషాల్లో ,MINS ఆసుపత్రికి ఐదు నిమిషాల్లో, పాఠశాలకు పది నిమిషాల్లో చేరుకోవచ్చన్నారు .

సుచిరిండియా ద టేల్స్ ఆఫ్ గ్రీక్ ప్రాజెక్ట్‌లో క్లబ్ హౌస్, బిజినెస్ లాంజ్‌, స్పా ,అండ్ సెలూన్ , వాస్తు, జిమ్‌, ఇండోర్ గేమ్స్ ఆడుకునేలా ఆట స్థలాలు ఉన్నాయని కిరణ్ కుమార్ చెప్పారు. దీంతో పాటు చిన్నారులు ఆడుకునే కిడ్స్ ప్లే ఏరియా ,లాబీ, పార్కులు, ప్లే గ్రౌండ్ , స్విమ్మింగ్ పూల్ ఛేంజింగ్ రూమ్స్, జాగింగ్ అండ్ అక్యూప్రెసర్ ట్రాక్, పార్టీ హాల్, బార్బీక్యూపిట్స్, స్నాక్స్ బార్, డిపార్ట్‌మెంటల్ స్టోర్, పార్టీ వాల్ , డాక్టర్ క్లీనిక్ ,క్రీచీలాంటి ఎమినిటీస్‌ను అందుబాటులో ఉంచామన్నారు.

గ్రీక్‌ అర్కిటెక్చర్‌తో నిర్మించనున్న  సుచిరిండియా ద టేల్స్ ఆఫ్ గ్రీక్  అపార్ట్‌మెంట్‌ ఆర్గానిక్ లివింగ్ తో కూడిన లగ్జరీ గెటెడ్ కమ్యూనిటీతో నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు .
సుమారు  175 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌లో వెయ్యి చదరపు గజాల డబుల్ బెడ్‌ రూం ఫ్లాట్ 45 లక్షలకు అందిస్తున్నట్లు వెల్లడించారు. 2023 నాటికి ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని కిరణ్ తెలిపారు .

సుచిరిండియా ద టేల్స్ ఆఫ్ గ్రీక్ అపార్ట్‌మెంట్‌లలో మూడు నాలుగు అంతస్తుల్లో బిజినెస్ లాంజ్‌లు, 24 అవర్స్ రెస్టారెంట్‌, పార్టీ హాల్, టీవీ, ఇతర లగ్జరీ సదుపాయాలు కల్పించామన్నారు . ఈ ప్రాజెక్ట్‌లో స్మార్ట్‌ హోలను నిర్మిస్తున్నామని …మొబైల్ ద్వారా కరెంట్ ఆన్ ఆఫ్ చేసుకునే సౌకర్యం కల్పించామన్నారు . ప్రత్యేక యాప్‌లు రూపొందించి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు . పికప్ అండ్ డ్రాప్ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని డాక్టర్ లయన్ కిరణ్ కుమార్ చెప్పుకొచ్చారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *