మిస్ సౌత్ ఇండియా 2021 గా కేరళకు చెందిన అన్నసి కబీర్
ముణప్పరం మిస్ సౌత్ ఇండియా 2021 గ్రాండ్ ఫినాలే కలర్ ఫుల్ గా సాగింది.
కొచిలోని మెరిడియన్ హోటల్ లో నిర్వహించిన ముణప్ఫరం మిస్ ఇండియా టైటిల్ దక్కించుకోవడం కోసం యువతులు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో ముద్దుగుమ్మలు తమ టాలెంట్ ను ప్రదర్శించారు.
కేరళకు చెందిన అన్నసి కబిర్ మిస్ సౌత్ ఇండియా 2021 టైటిల్ ను దక్కించుకోగా …తెలంగాణకు చెందిన యువతి దీప్తి శ్రీరంగం మిస్ సౌత్ ఇండియా క్వీన్ టైటిల్ ను గెలుచుకుంది.
కేరళ కి చెందిన మిస్ చంద్రలేఖ నాథ్ , శ్వేతా జయరామ్ మణప్పురం మిస్ సౌత్ ఇండియా 2021 పోటీలో రన్నరప్ గా నిలిచారు.
హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మణప్పురం ,పెగసెస్ సంస్థల ప్రతినిధులు ఈ పోటీలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో యువతులు దరఖాస్తు చేసుకున్న…ఫైనల్ పోటీలకు 20 మంది అందమైన యువతులు ఎంపిక అయ్యారని తెలిపారు.
హోరాహోరిగా సాగిన ఈ పోటీల్లో చివరికి కేరళ కి చెందిన అన్నసి కబీర్ మిస్ సౌత్ ఇండియా 2021 గా ఎంపికయ్యారు.