అరుదైన శస్త్ర చికిత్సను నిర్వహించి కవల పిల్లల్లో ఒకరిని కాపాడిన అంకుర ఆసుపత్రి వైద్యులు
హైదరాబాద్, బంజారాహిల్స్
మహిళ గర్భంలో అరుదైన పిండం ఉన్నట్లు గుర్తించిన వైద్యులు …కవల పిల్లల్లో ఒకరిని సురక్షితంగా కాపాడినట్లు అంకుర ఆసుపత్రి వైద్యులు శారదా వాణి తెలిపారు.
అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఆసుపత్రికి వచ్చిన మహిళ అరుదైన రకానికి చెందిన గర్భం ఉన్నట్లు గుర్తించామని ఆమె తెలిపారు .గర్భాశంలోని కవల పిల్లల్లో ఒకే ప్లాజంటా ,అమినోటిక్ సాక్ పంచుకుని ఉన్నట్లు తేలిందని…ఇలాంటి కేసులు 30 నుంచి 60 వేల గర్భాలలో ఒకటిగా ఉంటుందన్నారు. ఈ కవలల్లో ఒకరికి కపాలం ,మెదడు అసంపూర్ణంగా ఉండటంతో ఈ కేసును అత్యంత క్లిష్టతరంగా మారిందని డాక్టర్ శారద వాణి తెలిపారు. గర్భంలోని శిశువును రక్షించేందుకు సెలెక్టవ్ రిడక్షన్ ప్రత్యేక టెక్నిక్స్ ను ఉపయోగించిన తొలగించామని… ఈ సమయంలో గర్భస్రావానికి దారి తీసే ప్రమాదం ఉందని తెలిపారు .
హైదరాబాద్ కు చెందిన 30 ఏళ్ల ఆరోగ్యవంతమైన మహిళ అత్యంత అరుదైన రకానికి చెందిన గర్భంతో ఉన్నట్లుగా గర్భధారణ జరిగిన తరువాత 18వ వారంలో గుర్తించామని అంకుర హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గా ప్రసాద్ తెలిపారు. ఆమె మోనోకొరియోనిక్ ట్విన్స్ (గర్భాశయంలో ఇద్దరు పిల్లలు ఒకే ప్లాజంటా మరియు అమినోటిక్ సాక్ ను పంచుకోవడం) కలిగిఉన్నట్లుగా తేలిందన్నారు. ఇలా ఉండడం అత్యంత అరుదుని.. . 35 వేల నుంచి 60 వేల గర్భాల్లో ఒకటిగా ఇలాంటివి చోటు చేసుకుంటాయని తెలిపారు. ఇలాంటి స్థితిలో ఉన్న పిండాలు బతికేందుకు 50% గా మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కేసు విషయానికి వస్తే, ఈ కేసు విషయానికి వస్తే, కవలల్లో ఒకరికి కపాలం, మెదడు అసంపూర్ణంగా ఉండడం ఈ కేసును మరింత సవాలుతో కూడుకున్నదిగా చేసిందని వివరించారు. గర్భంలో ఉన్న శిశువును సెలెక్టివ్ రిడక్షన్ –ప్రత్యేక టెక్నిక్స్ ఉపయోగించి తొలగించామని ..వివరించారు. ఈ చికిత్సను మేం విజయవంతంగా చేయగలిగామని తెలిపారు .ఇద్దరు శిశువుల్లో ఒకరు పుట్టిన ఐదు నిమిషాల్లోనే చనిపోయారని… మరో శిశువు ఆరోగ్యంగా ఉన్నారని వివరించారు. ఇలాంటి అరుదైన కేసును విజయవంతంగా నిర్వహించినందుకు తమకెంతో ఆనందంగా ఉందన్నారు .ఇది దేశంలోనే అత్యంత అరుదైందన్నారు.
అత్యంత అరుదైన అవకాశం అంకుర హాస్పిటల్ కు రావడం…ఎలాంటి రిడక్షన్ చేయకుండా, ప్రసవం జరిగిందని డాక్టర్ శారదా వాణి వివరించారు. కాబోయే తల్లి కోసం ఎక్స్ పెక్టెంట్ మేనేజ్ మెంట్ ను ఎంచుకున్నామని.. దాంతో ఆమెకు ప్రత్యేక సంరక్షణను అందించామన్నారు. ఆమెకు ఇది రెండో కాన్పు. ఇతర వైద్యసమస్యలేవీ లేకుండా ఆమె ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు . గర్భధారణ జరిగిన 20 వారాల అనంతరం ఆమెకు పూర్తిగా బెడ్ రెస్ట్ ఇచ్చామని… పిండాల ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వచ్చామన్నారు. ఇందు కోసం నాన్ స్ట్రెస్ టెస్టులు, మెజర్ మెంట్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్, సీరియల్ గ్రోత్ స్కాన్స్, అంబిలికల్ అర్టెరి డాప్లర్ స్టడీస్ లాంటివి ఉపయోగించామన్నారు.
బ్లడ్ ఫ్లో, ఎదుగుదల, ఇతర ఫిజియోలాజికల్ పరామితులు ఈ టెస్టుల ద్వారా పరిశీలించామని వివరించారు. ఆమెకు ముందుగానే నొప్పులు రావడంతో, 33 వారాల గర్భధారణ సమయంలోనే, అత్యవసర సి- సెక్షన్ చేయాల్సి వచ్చిందన్నారు. కవలల ప్రసవం విజయవంతంగా జరిగిందని.. అయితే, తగిన సంరక్షణ అందించినప్పటికీ, కపాలం సరిగా లేని శిశువు మృతి చెందిందని తెలిపారు. మరో ఆడ కవల శిశువు 1590 గ్రాముల బరువుతో పుట్టిందని.. పుట్టగానే ఏడ్చినా, ప్రిమెచ్యూరిటీ కారణంగా శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తాయని తెలిపారు. ఆ శిశువుకు లెవల్ 3 ఎన్ఐసియు లో ప్రత్యేక సంరక్షణ అందించామని వివరించారు. ఆ శిశువు శ్వాస సంబంధిత సమస్యలను, జాండిస్ ను కూడా అధిగమించగలిగిందని … మరే వైద్య సమస్యలు రాలేదన్నారు . ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉందని.. బరువు పెరగడం మొదలైందన్నారు.
‘‘మోనో అమ్నియోటిక్ కవలల్లో ప్రిమెచ్యూరిటీ అనేది పెద్ద సమస్యఅని ఇలాంటి కేసుల్లో 34 వారాల కంటే ముందుగానే ప్రసవాలు జరుగుతుంటాయని నియోనాటలజిస్ట్ డాక్టర్ చంచల్ కుమార్ తెలిపారు. ఇప్పుడు ‘నార్మల్’ అని వ్యవహరిస్తున్న శిశువు కూడా ఇతర సాధారణ శిశువులతో పోలిస్తే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని తెలిపారు . ఎన్ఐసియులో తగిన ప్రత్యేక సంరక్షణ అందించడం చక్కటి ఫలితాలను అందించిందని తెలిపారు. ఇలాంటి గర్భధారణల్లో లోపాలు తలెత్తడం అరుదైనప్పటికీ, ఎక్స్ పెక్టంట్ మేనేజ్ మెంట్ అనేది ఆరోగ్యంగా ఉన్న శిశువును ఎలాంటి సమస్యలు లేకుండా ప్రసవం కు తోడ్పడుతుందని వివరించారు.