వ్యాక్సినేషన్ అవగాహన కోసం సందేశాత్మక యానిమేషన్ వీడియోను విడుదల చేసిన సైబరాబాద్ సిపి సజ్జనార్
వ్యాక్సినేషన్ అవగాహన కోసం సందేశాత్మక యానిమేషన్ వీడియోను విడుదల చేసిన సైబరాబాద్ సిపి సజ్జనార్
హైదరాబాద్:
సీనియర్ లాప్రొస్కోపిక్ మరియు బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ టి. వరుణ్ రాజు రూపొందించిన 3 నిమిషాల నిడివిగల సందేశాత్మక వ్యాక్సినేషన్ అవగాహన యానిమేషన్ వీడియోను సైబరాబాద్ పోలీస్ కమీషనర్ మరియు అదనపు డిజిపి వి సి సజ్జనార్ విడుదల చేశారు. డా. వరుణ్ రాజు కాన్సెప్ట్ ని సజ్జనార్ అభినందించారు. ఈ వీడియో ని మరింత ప్రచారం కల్పించాలని కోరారు.
ఈ సందర్భంగా డా. వరుణ్ రాజు, బాద్యతగల వైద్యుడిగా ఈ విపత్కర పరిస్థితుల్లో కరోనాపై మొదటినుండి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రజలలో ఉన్న అపోహలని పొగోట్టడానికి ప్రత్నిస్తున్నానని అందులో భాగంగానె మాటలు, మ్యూజిక్ తో కూడిన యానిమేషన్ వీడియోను “జేకే ఫ్రేంస్” జగదీష్ మరియు సత్యా ల సాహకరంతో రూపొందించామన్నారు. వ్యాక్సినేషన్ ఆవశ్యకతను, ప్రజల అపోహలని పొగోట్టే సందేశాన్ని ఇచ్చామని ఆయన అన్నారు,
వీడియోను విడుదల చేసినందుకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
డా. వరుణ్ రాజు గత 22 సంవత్సరాలుగా నగరంలోని దుర్గాభాయ్ దేష్ముఖ్, పేస్, ఓమిని ఆసుపత్రులలో వైద్య సేవలందించారు, ప్రస్తుతం మియాపూర్ లోని తన టి.వి.ఆర్ డే కేర్ సెంటర్ పూర్తిస్థాయి వైద్యసేవలనందిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఏసిపి హనుమంతరావ్, పిఆర్వో జయరాం, రమేష్ బాబు, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.