యుఎస్‌ఏలో 2022 సంవత్సరానికిగానూ టాప్ డైనమిక్ సీఈఓలలో ఒకరిగా నిలిచిన తెలుగు వ్యాపారవేత్త అనిల్ గ్రంధి
తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం
ఏజీ ఫిన్‌ట్యాక్స్, యుఎస్‌ఏ వ్యవస్ధాపకులు సీఈఓ అనిల్ గ్రంధిని ‘టాప్ 20 డైనమిక్ సీఈవోస్ ఆఫ్ 2022 ఇన్ యుఎస్‌ఏ’( యుఎస్‌ఏలో 2022 సంవత్సరానికిగానూ టాప్ 20 డైనమిక్ సీఈవోలలో ఒకరు)గా ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ద సీఈవో పబ్లికేషన్ గుర్తించింది. అమెరికన్ సీఈఓల కోసం ప్రత్యేకంగా సృష్టించిన డిజిటల్ వేదిక, ద సీఈఓ పబ్లికేషన్. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ ఫైనాన్స్ కౌన్సిల్ మెంబర్‌గా కూడా అనిల్ గుర్తింపుపొందారు.
కేవలం 40 సంవత్సరాల వయసులో, యుఎస్‌ఏలోని భారతీయ టాప్ సీఈఓల జాబితాలో అనిల్ చేరారు. ఈ జాబితాలోని సీఈఓలు ముందుచూపున్న వ్యక్తులు మాత్రమే కాదు, అసాధారణ మేనేజ్‌మెంట్ నైపుణ్యాలనూ ప్రదర్శిస్తున్నారు. ట్యాక్స్ ప్లానింగ్‌లో అనిల్ యొక్క వినూత్నమైన విధానాలు వ్యాపార సంస్ధలు అధిక మొత్తంలో నగదు పొదుపు చేయడంలో సహాయపడటంతో పాటుగా వారి నగదు ప్రవాహాన్ని సైతం పెంచాయి.
‘‘వ్యాపారవేత్తలు మరియు చిరు వ్యాపార సంస్థలకు పన్ను ప్రణాళిక, సీఎఫ్‌ఓ సేవలు, వెల్త్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ ఔట్‌లుక్స్ పట్ల అనిల్ గ్రంధి యొక్క నైపుణ్యం మరియు మార్గనిర్దేశనం గమనించతగ్గది. అందుకే ఆయన 2022 యొక్క టాప్ 20 డైనమిక్ సీఈవోలలో ఒకరిగా గుర్తించబడ్డారు. నిజమైన ప్రేరణను అనిల్ అందించారు’’అని ద సీఈఓ పబ్లికేషన్ మేనేజింగ్ ఎడిటర్ ఆడమ్ ప్యాట్రిక్ అన్నారు.తన కలల సాకారానికి వెన్నంటి ఉండి ప్రోత్సహించిన తన తల్లిదండ్రులు, తమ సిబ్బందికి ఈ అవార్డును అంకితం చేస్తున్నానని అనిల్ గ్రంధి అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా రాజం నుంచి అనిల్ వచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన గ్రంధి వీరభద్ర రావు, ధనలక్ష్మి ల కుమారుడు అనిల్. రాజంలో తన పాఠశాల విద్యను పూర్తి చేసిన అనిల్, తన ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేయడం కోసం 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కాలేజీకి వెళ్లేవారు. తెలుగు మీడియంలో విద్యనభ్యసించిన అనిల్, హైస్కూల్ విద్య నుంచి కూడా టాపర్‌గానే ఉండేవారు. రాజం లోని జీసీఎస్‌ఆర్ డిగ్రీ కళాశాల నుంచి కామర్స్‌లో గ్రాడ్యుయేట్‌గా సిల్వర్ మెడల్ తో అత్యున్నత గౌరవాన్ని పొందిన అనిల్, చార్టర్డ్ ఎక్కౌంటెన్నీ కోర్సుకు నమోదు చేసుకున్నారు. హైదరాబాద్‌లోని పీడబ్ల్యుసీ వద్ద ఆర్టికల్‌షిప్ చేసిన ఆయన సీఏ విద్యను పూర్తి చేశారు.
అత్యున్నత గుర్తింపును అనిల్ పొందడం పట్ల తన సంతృప్తిని వ్యక్తం చేసిన జీఎంఆర్ గ్రూప్ ఛైర్మన్ శ్రీ గ్రంధి మల్లికార్జున రావు మాట్లాడుతూ అనిల్ సాధించిన అసాఽధారణ గుర్తింపును కొనియాడారు. ప్రతిష్టాత్మకమైన మరియు విజనరీ లీడర్‌గా అనిల్ ఎదుగుతున్నారని, ఇతరులకు స్ఫూర్తిదాయకంగా అతను ఉంటూనే వారి దృష్టిని వాస్తవంగా మార్చడంలో కూడా సహాయం చేస్తున్నాడని ప్రశంసించారు. రాజం లాంటి మారుమూల ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ, అనిల్ యొక్క అసాధారణ నైపుణ్యాలు మరియు సామర్ధ్యం వంటివి యుఎస్‌ఏ లాంటి అత్యంత పోటీ కలిగిన దేశాలలో అత్యున్నతప్రతిభావంతుల సరసన విజయవంతమయ్యేందుకు దోహద పడ్డారన్నారు.
శివ గ్రూప్ మరియు డాటా ట్రాక్స్‌తో చెన్నైలో పలు కార్పోరేట్ సంస్ధలకు సేవలనందించిన అనంతరం ఆయన సన్ ఎడిసన్‌లో ఫైనాన్షియల్ కంట్రోలర్‌గా చేరారు. అనంతరం ఆయన యుఎస్‌ఏలోని సెయింట్ లూయిస్ వద్దనున్న సన్ ఎడిసన్ యొక్క కార్పోరేట్ కార్యాలయంకు చేరారు. అక్కడ ఆయనకు ట్రెజరీ మేనేజ్‌మెంట్ సహా పలు అదనపు బాధ్యతలు అప్పగించారు. అక్కడ కొన్ని సంవత్సరాలు పనిచేసిన అనంతరం ఆయన అమెజాన్‌కు , ఆ తరువాత స్టార్‌బక్స్‌కు వెళ్లారు. 2019లో ఆయన వ్యాపారవేత్తగా మారాలనుకున్నారు. అనంతరం వాషింగ్టన్ లోని సీయాటెల్ లో ట్యాక్స్ ప్లానింగ్ ఎడ్వైజరీ సేవల కంపెనీగా ఏజీ ఫిన్‌ట్యాక్స్ ప్రారంభించారు. నేడు ఏజీ ఫిన్‌ట్యాక్స్ వేలాది క్లయింట్లకు సేవలనందిస్తోంది. ఈ క్లయింట్‌లలో యుఎస్‌ఏలోని ఫార్చ్యూన్ 500 కంపెనీలు మొదలు చిరు వ్యాపార యజమానుల వరకూ ఉన్నారు. తమ వినూత్నమైన వ్యాపార పరిష్కారాల కారణంగా ఈ కంపెనీ అపూర్వమైన విజయం సాధించింది. గత రెండు సంవత్సరాలలో 2400% వృద్ధిని ఈ కంపెనీ నమోదు చేసింది.
యుఎస్‌ఏలో చిరు వ్యాపారుల నడుమ అత్యంత ప్రాచుర్యం పొందిన వ్యక్తి అనిల్ గ్రంధి. ఎందుకంటే, యుఎస్ ప్రభుత్వం అందించిన కోవిడ్ ఉపశమన ప్రయోజనాలను లక్షలాది మంది చిరు వ్యాపార యజమానులకు చేరువ చేసేందుకు ఆయన ఎంతగానో శ్రమించారు. అనిల్ యొక్క కంపెనీ యుఎస్ ప్రభుత్వం నుంచి 300 మిలియన్ డాలర్లను చిరు వ్యాపార యజమానులకు బదలాయించింది. 2021 నుంచి , ఆయనను అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫోర్బ్స్ ఫైనాన్షియల్ కౌన్సిల్‌లోకి అంగీకరించబడ్డారు.
అనిల్‌ను అంతకు ముందు భారతదేశంలో యూత్ ఐకాన్‌గా ఒక సేవా సంస్థ గుర్తించింది. అలాగే ఇతర కమ్యూనిటీ సభ్యులకు స్ఫూర్తిదాయకంగా నిలిచినందుకు యుఎస్‌ఏలోని తెలుగు అసోసియేషన్లు సైతం ఆయనను సత్కరించాయి.
యుఎస్‌ఏలోని తెలుగు వారి నడుమ అత్యంత ప్రాచుర్యం పొందిన వ్యక్తులలో ఒకరిగా ఆయన ఎన్నో జాతీయ స్థాయి అసోసియేషన్లు అయినటువంటి తానా, నాట్స్, అటా తో పాటుగా న్రివాతో కూడా ఆయన యుఎస్‌ఏలో భాగస్వామిగా ఉన్నారు. ముందు చూపున్న వ్యక్తిగా మాత్రమే కాదు కష్టించే మనస్తత్వం కలిగిన అనిల్, యుఎస్‌ఏ వ్యాప్తంగా పలు ఆర్ధిక, పన్నులు సంబంధిత అంశాలసై పలు వెబినార్లు, సెమినార్లు, సదస్సులలో ప్రసంగిస్తుంటారు. పలు టీవీ ఛానెల్స్, సామాజిక మాధ్యమాలలో సైతం ఆయన అతిథిగా తన అభిప్రాయాలను పంచుకుంటూనే ఉంటుంటారు. అనిల్ గ్రంధి ఇప్పుడు సీ యాటెల్, వాషింగ్టన్ లో భార్య శ్రీదేవి, పిల్లలు రిషి, అభినవ్‌తో కలిసి జీవిస్తున్నారు