ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్‌లో ‘ ఎట్ హోమ్ ‘ రద్దు
అమరావతి
కరోనా పరిస్ధితుల నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున రాజ్ భవన్‌లో నిర్వహించే ‘ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని నిర్వహించకూడదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ నిర్ణయించారని గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్‌లో గౌరవ గవర్నర్ ‘ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యమంత్రి, మంత్రులు, న్యాయమూర్తులు, సీనియర్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్వాతంత్ర్య సమరయోధులు, అవార్డు విజేతలు, మీడియా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా పాల్గొనేవారు. కరోనా ఇక్కట్ల నేపధ్యంలో ప్రస్తుత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సామూహిక కార్యక్రమాన్ని నిర్వహించరాదని గవర్నర్ ఆదేశించినట్లు ముఖేష్ కుమార్ మీనా వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవటం వంటి కరోనా ప్రవర్తనా నియమావళిని పాటించటం ద్వారా కోవిడ్ నుండి రక్షణ పొందాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు, అర్హులైన వారందరూ ప్రాధాన్యత ఆధారంగా టీకాలు వేయించుకోవాలని, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా తగిన ప్రవర్తనా నియమావళిని అనుసరించాలని కోరారు.