అంతెరా రెస్టారెంట్ ను ప్రారంభించిన సినీ నటులు నిఖిల్ , సుమంత్

హైదరాబాద్


రుచికరమైన తెలుగు వంటకాలను భాగ్యనగరవాసులకు అందించేందుకు మరొకొత్త రెస్టారెంట్‌ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లోని రోడ్ నెంబర్ 10 లో అంతేరా పేరుతో ఏర్పాటు చేసిన రెస్టారెంట్‌ను సినీ నటులు నిఖిల్ ,ససుమంత్ లు ప్రారంభించారు. .

సాంప్రదాయ వాతావరణంతో రుచికరమైన స్థానిక తెలుగు వంటకాలను రుచులు అందిస్తున్న ఈ మరింత పురోభివృద్ధి సాధించాలని నిఖిల్ అన్నారు. రుచికరమైన విందుతో పాటు నచ్చిన రుచికరమైన పానీయాలతో క్లబ్ లో ఎంజాయ్ చేయవచ్చువచ్చన్నారు నిర్వాహకులు సింగిరెడ్డి పూజా రెడ్డి, ఆశిష్ రెడ్డి, సౌమిత్ రెడ్డి , అనురాగ్ రెడ్డి అన్నారు. సకుటుంబ సపరివార సమేతంగా హజరయ్యే వారికి ఈ రెస్టారెంట్ లోని వంటకాల రుచులు గుర్తుండిపోతాయన్నారు.

కోవిడ్ -19 జాగ్రత్తలతో పాటు ప్రోటోకాల్‌లను సిబ్బంది అనుసరిస్తూ, భౌతిక దూరం పాటిస్తారని నిర్వహకులు తెలిపారు. ఆంతేరా రెస్టారెంట్ 160 మంది కూర్చునే సామర్థ్యంతో ఉందన్నారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11.30 గంటల వరకు నాన్-స్టాప్ లంచ్ , డిన్నర్ అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

ఆంధ్ర,రాయలసీమ,తెలంగాణ వంటకాలను ఈ రెస్టారెంట్‌లో అందిస్తున్నట్లు నిర్వహకులు సింగిరెడ్డి పూజారెడ్డి తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *