యుపీఎస్‌సీ సన్నాహంపై సెమినార్‌ను నిర్వహించిన విజన్ ఐఏఎస్…టాపర్స్ టాక్‌లో తాను కష్టపడిన విధానాన్ని వెల్లడించిన ఆల్ ఇండియా 20 ర్యాంకు సాధించిన పి శ్రీజ
హైదరాబాద్, ఆర్టీసీ ఎక్స్ రోడ్
భారతదేశంలో అత్యంత తీవ్రమైన పోటీకలిగిన పోటీ పరీక్ష సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్‌ఈ). ఇండియన్ అడ్మిన్‌స్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పొలీస్‌సర్వీస్ సహా భారతప్రభుత్వ అత్యున్నత పౌర సేవలకు సంబంధించిన నియామకాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంటుంది. యుపీఎస్‌సీ ఎగ్జామినేషన్ మూడు దశలలో నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలలో రెండు ఆబ్జెక్టివ్ తరహా పేపర్లు (జనరల్ స్టడీస్ పేపర్ 1 మరియు జనరల్ స్టడీస్ పేపర్ 2 ఉంటాయి. సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లేదా సీశాట్‌గా ఇది ప్రాచుర్యం పొందింది) , మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటాయి. ఈ మెయిన్ ఎగ్జామినేషన్‌లో 9 పేపర్లు సంప్రదాయ తరహా (వ్యాసరచన తరహా)ఉంటాయి. వీటిలో రెండు పేపర్లు అర్హత కోసం అయితే మిగిలిన ఏడూ మార్కుల కోసం లెక్కిస్తారు. దీనిని అనుసరించి వ్యక్తిగత పరీక్ష (ఇంటర్వ్యూ) ఉంటుంది. ఓ విజయవంతమైన అభ్యర్ధి ఈ ప్రక్రియ మొత్తం మీద 32 గంటల పాటు పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
విజన్ ఐఏఎస్ బ్రాండ్ హెడ్ ఫణి మాట్లాడుతూ తాము యుపీఎస్‌సీ సన్నాహం, వ్యూహంపై ఆల్ ఇండియా ర్యాంక్ 20 సాధించిన మా క్లాస్‌రూమ్ విద్యార్థి చేత ఓ సెమినార్‌ను నిర్వహించారు. భారతదేశంలో తమకు 10 శాఖలు ఉన్నాయి. దీనిలో దక్షిణ భారతదేశంలో ఒకే ఒక్క శాఖ, అదీ హైదరాబాద్‌లో ఉందన్నారు.
ఆల్ ఇండియా ర్యాంక్ –20 సాధించిన పి. శ్రీజ తెలుగు రాష్ట్రాలలో అగ్రస్ధానంలో నిలిచారు. ఆమె విజన్ ఐఏఎస్ హైదరాబాద్ సెంటర్‌లో క్లాస్‌రూమ్ కోచింగ్ తీసుకోవడంతో పాటుగా తన మొదటి ప్రయత్నంలోనే ఈ ర్యాంక్‌ను సాధించిందని ఫణి తెలిపారు .ఈ సందర్భంగా ఆల్ ఇండియా 20 వ ర్యాంకు సాధించిన శ్రీజను సంస్థ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు .
విజన్ ఐఏఎస్ , హైదరాబాద్‌లో తమ శాఖను 2015వ సంవత్సరంలో ప్రారంభించిందని ఫణి తెలిపారు. భా సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సహాయపడేందుకు నిరంతరమూ నూతన ఆవిష్కరణలను చేయడంతో పాటుగా అనుసంధానిత అభ్యాస వ్యవస్థ, టీమ్ వర్క్, సాంకేతికత , ఆవిష్కరణలతో సమగ్రమైన ప్రయత్నాల ద్వారా వారి కలలను సాకారం చేస్తుందన్నారు .
కోటి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశానని… తాను యూపీఎస్సీ పరీక్షలు రాసి మొదటి ప్రయత్నంలో ఆల్ ఇండియా 20 వ ర్యాంకు రావడం తనకెతో సంతోషంగా ఉందని శ్రీజ అన్నారు .తల్లిదండ్రులు, మిత్రులు, ఉపాధ్యాయుల సహకారంతోనే ఈ విజయం సాధ్యమైందన్నారు.