శ్రీ దుర్గా భవాని దేవాలయానికి ఐజా గ్రూప్ చైర్మన్ గయాజుద్దీన్ ఆర్థిక సాయం

విజయవాడ : శ్రీ దుర్గా భవాని దేవాలయానికి ఐజా గ్రూప్ చైర్మన్ గయాజుద్దీన్ ఆర్థిక సహాయం అందించారు. ఐజా గ్రూప్ తరపున పలువురికి ఆర్థిక సహాయం అందజేసినట్టు ఐజా గ్రూప్ సంస్థల చైర్మన్, జనసేన విజయవాడ నగర అధికార ప్రతినిధి, మైనార్టీ నాయకులు షేక్ గయాజుద్దీన్ ఐజా చెప్పారు. గురువారం భవానిపురం 40వ డివిజన్ లోని కరకట్ట ప్రాంతంలో గల శ్రీ దుర్గా భవాని దేవస్థానం రంగుల నిమిత్తం 16 వేల రూపాయలను ఐజా అందజేశారు.

అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న 44వ డివిజన్ కు చెందిన ఫిరోజ్ అనే యువకుడికి మూడు వేల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించారు. ఇదే రీతిలో ఇటీవల ప్రభుత్వ పెన్షన్ కోల్పోయిన దివ్యాంగురాలు ఇరువూరి ప్రశాంతి కుమారికి ఒక నెల పెన్షన్ 3000 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా ఐజా మాట్లాడుతూ తమ ఐజా ట్రస్ట్ తరఫున పలు సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా గత మూడు నెలల నుంచి ప్రతి నెలా మూడు వేళా రూపాయలు చొప్పున దివ్యాంగురాలైన ప్రశాంతికి తన వంతుగా పెన్షన్ ను అందజేస్తున్నట్లు ఆయన వివరించారు. పార్టీలకు అతీతంగా ప్రశాంతికి తిరిగి దివ్యాంగురాలు పెన్షన్ ఇచ్చేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కుల మతాలకు అతీతంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను తమ గ్రూప్ తరపున నిర్వహిస్తున్న గయాజుద్దీన్ కు పలువురు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ కనకదుర్గ దేవాలయం అధ్యక్షులు వెంకట్రావు, రేలంగి బుజ్జి ,జి. దుర్గారావు, జి .గణేష్ ,బొబ్బిలి సన్యాసిరావు, ఐజా గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *