ఆయిల్ ఫెడ్ నుంచి విజయ బ్రాండ్ నిత్యావసర సరుకులను మార్కెట్ లోకి విడుదల చేసిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్, బేగంపేట

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయిల్ ఫెడ్ టర్నోవర్ ఏడు వందల కోట్లు దాటిందని..దీనిలో 57 కోట్ల నికరలాభం అర్జించడం గొప్పవిషయమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కితాబిచ్చారు. హైదరాబాద్ బేగంపేట్ టూరిస్ట్ ప్లాజా హటల్ లో తెలంగాణ ఆయిల్ ఫెడ్ నుంచి  విజయ బ్రాండ్ కు చెందిన 23 రకాల నిత్యావసర సరుకులను మార్కెట్‌లోకి విడుదల చేశారు.
1983లో ప్రారంభమైన ఆయిల్ ఫెడ్ కార్పోరేషన్ వంటనూనెలను, కిన్నెర వాటర్ బాటిల్స్ ను అందిస్తోందని…తాజాగా నాణ్యమైన నిత్యావసర సరుకులను తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు.
రైతుల నుంచి పండించిన పంట ఉత్పత్తులతో తయారు చేసిన విజయ బ్రాండ్ ఉత్పత్తులను ఆదరించాలని పిలుపునిచ్చారు. పంటల ఉత్పత్తిలో రసాయనిక ఎరువులు తగ్గించేందుకు రైతులను చైతన్యం తీసుకురావాలని కోరారు.

కల్తీ లేని నిత్యావసర సరుకులు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్విరామంగా కృషిచేస్తుందని..ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఫెడ్ నుంచి నిత్యావసర సరుకులు అందిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సహాఖ్య ఛైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. తెలంగాణ ఏర్పడే నాటికి ఉమ్మడి రాష్ట్రంలో ఆయిల్ ఫెడ్ టర్నోవర్ రూ.200 కోట్లు ఉందని…  ఒక్క రూపాయి కూడా లాభాల్లో లేదన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో   ఆయిల్ ఫెడ్ టర్నోవర్ రూ.700 కోట్లు దాటిందన్నారు .నూనె గింజలైన వేరుశనగ, నువ్వుల,కొబ్బరి ,ఆయిల్ ఫాం తదితర పంట ఉత్పత్తుల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. కార్పోరేట్ సంస్థల్లో సైతం కల్తీ ఆయిల్ , కల్తీ సరుకులు విక్రయిస్తున్నారని కల్తీని నిరోధించేందుకు , ధరలు పెరగకుండా ఉండేందుకు ఆయిల్ ఫెడ్ సంస్థ నిత్యావసర సరుకులను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు . సీఎం కేసీఆర్ సైత ఆయిల్ ఫెడ్ ను ప్రొత్సహిస్తున్నారని కంచర్ల రామకృష్ణారెడ్డి తెలిపారు.  సాధారణ వ్యక్తులు విజయవంతంగా వ్యాపారం చేస్తున్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకు చేయకూడదని సీఎం కేసీఆర్ చెప్పారని…అందుకే ఈ ఉత్పత్తులను తీసుకువచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి , విజయ బ్రాండ్ డీలర్లు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *