తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గారి సమర్ధ నాయకత్వం లో తెలుగు భాషాభివృద్ధికి, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, సాహిత్య సంపద పరిరక్షణకు పెద్దపీట వేశారు : రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గారి సమర్ధ నాయకత్వం లో తెలుగు భాషాభివృద్ధికి, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, సాహిత్య సంపద పరిరక్షణకు పెద్దపీట వేశారని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ అన్నారు
హైదరాబాద్ లోని తన కార్యాలయంలో తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ సమర్ధ నాయకత్వం లో తెలుగు భాషాభివృద్ధికి, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, సాహిత్య సంపద పరిరక్షణకు పెద్దపీట వేశారన్నారు. గత ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు తెలంగాణ కు చెందిన చరిత్ర, సాహిత్యం, కళలు, భాష, యాసలను ఎంతో నిర్లక్ష్యం చేశారన్నారు మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ . తెలంగాణ కు చెందిన ప్రాచీన కళలు, సాహిత్యం, చరిత్ర లకు పూర్వ వైభవాన్ని తీసుకవచ్చేలా కృషి చేస్తున్నందుకు మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరి శంకర్ ను అభినందించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి సభ్యులు, ప్రజా వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.