నీలోఫర్‌ హాస్పిటల్‌లో మౌలిక వసతుల కల్పనకు చేయూతనందించిన ఏడీపీ

హైదరాబాద్‌

ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఏడీబీ కార్పోరేట్ సోషల్ రెస్సాన్సిబులిటీలో భాగంగా పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సేవలు అందిస్తోంది. ఈ ఏడాది చిన్న పిల్లల ఆసుపత్రి అయిన నీలోఫర్ ఆసుపత్రికి ప్రీమియం ఐసీయూ యంత్రసామాగ్రిని ఏడీబీ సంస్థ విరాళంగా అందజేసింది. ఐసీయూ పడకలు,కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేలా యంత్రసామాగ్రిని సమకూర్చింది.

దేశం కోవిద్ సెకండ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొంది. థర్డ్ వేవ్ ముప్పును ఎదుర్కొనేందుకు సిద్దమవుతోంది. థర్డ్ వేవ్ ప్రధానంగా చిన్నారులపై పడుతుందని భావిస్తున్న నేపథ్యంలో సాఫ్ట్ వేర్ సంస్థ ఏడీబీ ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో ఏడీబీ ఇండియా పది పడకల ఐసీయూ వార్డులు పూర్తిగా పనిచేసేందుకు అవసరమైన యంత్రసామాగ్రిని అందించింది. ఐసీయూలో కార్డియాక్‌ మానిటర్లు, వెంటిలేటర్లు, బెడ్స్‌, ఈసీజీ మెషీన్లు, బైపాప్‌ మెషీన్లు, డిఫిబ్రిల్లేటర్స్‌, నర్సింగ్‌ స్టేషన్‌కు అవసరమైన యంత్రసామాగ్రి, ఎయిర్‌ కండీషనింగ్‌, లారిన్గోస్కోప్స్‌ మరియు ఐసీయు సిరెంజ్‌ పంపులు వంటివి అందించింది.

కరోనాను సమర్థవంగా ఎదుర్కొనేందుకు వైద్యులు, శానిటేషన్ వర్కర్లు, పోలీసులు, ఎన్ జీ వోలు ,వాలంటీర్లు కమ్యూనిటీలు ముందుకు వచ్చాయి. సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా సాఫ్ట్ వేర్ సంస్థ ఏడీబీ ప్రభుత్వ ఆసుపత్రిల్లో మౌళిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తుందని ఏడీపీ ఇండియా డివిజినల్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్ విపుల్ సింగ్ తెలిపారు. ఏడీపీ ఇండియా ఆసుపత్రుల్లో ఆరోగ్య మౌలిక వసతులను మెరుగుపరచడంలో సహాయపడటాన్ని లక్ష్యంగా చేసుకుందని డాక్టర్‌ విపుల్‌ సింగ్‌ తెలిపారు .

కరోనా మహమ్మారి సమయంలో పలు సమాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించామని విపుల్ సింగ్ వివరించారు. నిరుపేదలకు శానిటేషన్ ,మాస్కులు, దుప్పట్ల పంపిణీ కార్యక్రమం, శుభ్రతా కిట్‌లను పంపిణీ చేశామన్నారు. చిన్నారులు ,అల్పాదాయ కుటుంబాలలోని బాలికలకు వర్ట్యువల్‌ విద్యను అందించేందుకు సహకారం అందిచామన్నారు.

కోవిద్ సంక్షోభ సమయంలో నీలోఫర్‌ ఆస్పత్రికి తోడ్పాటునందించిన ఏడీపీ ఇండియాకు తెలంగాణా రాష్ట్ర వైద్య విద్య , డైరెక్టర్‌ రమేష్‌ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు . ఈ ఆస్పత్రి కేవలం తెలంగాణా రాష్ట్రంలోని చిన్నారులకు మాత్రమే కాకుండా ఏపీ, కర్నాటకతో పాటు వివిధ రాష్ట్రాల కు చెందిన చిన్నారులకూ వైద్య సేవలను అందిస్తుందన్నారు. కోవిడ్‌ కోసం సన్నద్ధం కావడంలో తమకు సహాకరించిన ఏడీపీ ఇండియా యాజమాన్యాన్ని అభినందించారు. నీలోఫర్‌కు ఏడీపీ ఇండియా అందించే మద్దతు, ఇతర కార్పోరేట్‌ సంస్థలు సైతం సీఎస్‌ఆర్‌ ద్వారా తమ వంతు తోడ్పాటును అందించాలన్నారు.

నీలోఫర్ ఆసుపత్రిలో ఐసీయూ వార్డును ఏర్పాటు చేసిన ఏడీపీ ఇండియాను నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండ్ మురళీకృష్ణ అభినందించారు.ఏడీపీ ఇండియా అందించిన యంత్రసామాగ్రి వల్ల మరింత మందికి సేవ చేసే అవకాశం కలుగుతుందన్నారు .దేశవ్యాప్తంగా ఆస్పత్రులన్నీ కూడా పూర్తి స్ధాయిలో నిర్వహించతగిన ఐసీయుల కోసం సిద్థమవుతున్న వేళ, ఏడీపీ ఇండియా అందించిన సహకారం మరువలేమని మురళీకృష్ణ అన్నారు .

వైరస్ తో పోరాడేందుకుతమ వంతు సహకారం అందిస్తామని ఏడీపీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అందించిన ఏడీపీ ఇండియా డివిజినల్ వైస్ ప్రెసిడెంట్ ,హెచ్ఆర్ విపుల్ సింగ్ తెలిపారు.
కోవిద్ వైరస్ పోరాటంలో తాము భాగస్వాములు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సోషల్ రెస్సాన్సిబులిటీలో భాగంగా ఏడీపీ ఇండియాలో పనిచేస్తున్న ఉద్యోగులు ,వారి కుటుంబసభ్యులకు ఉచితంగా రెండు విడతల టీకాలు వేయించామన్నారు. దాదాపు 11 వేల మంది లబ్దిదారులకు ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందారని ఆయన వెల్లడించారు. ఏడీపీ కేర్స్, అమెరికన్ ఇండియా ఫౌండేషన్ ద్వారా 1,50,00 డాలర్ల విరాళం అందించామన్నారు. పీఎం కేర్స్ ఫండ్ కు 50 లక్షల రూపాయలు, కరోనా మొదటి విడతలో హైదరాబాద్, పూనెలలో వలస కూలీలకు , దినసరి కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని విఫుల్ సింగ్ తెలిపారు.
మేకింగ్ ఇంపాక్ట్ ఫుల్ డిఫరెన్స్ ఎట్ స్కూల్ కార్యక్రమం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 46వేల మంది ప్రయోజనం పొందారని చెప్పారు. కరోనా మహమ్మరితో పోరాడుతున్న దేశానికి పలు మార్గాల ద్వారా ఏడీపీ ఇండియా సహకారం అందించిందన్నారు. సైబరాబాద్ పోలీసుల సహకారంతో కమ్యూనిటీ నిఘా కోసం గచ్చిబౌలి, నానక్ రాంగూడ, హైదరాబాద్ ప్రాంతాల్లో సీసీ టీవీలు అందించామని విపుల్ సింగ్ చెపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *