హైదరాబాద్ హెచ్ఐసీసీ నోవాటెల్ లో ఈ నెల 16 వ తేదీ నుంచి హైలైఫ్ బ్రైడ్స్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్
పండుగలు,పెళ్ళిళ్ళ షాపింగ్ కోసం హైలైఫ్ ఫ్యాషన్ డిజైనరీ ఎగ్జిబిషన్ చక్కటి వేదిక అని సినీనటులు వర్షిణి సౌందరరాజన్ , స్రవంతి ,ప్రీతి సుందర్ అన్నారు .
హైదరాబాద్ హెచ్ఐసీసీలో
అక్టోబర్ 16 నుంచి 18 వ తేదీ వరకు జరగనున్న హైలైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ బ్రోచర్ ను మోడల్స్ తో కలిసి వారు ఆవిష్కరించారు .డిజైనరీ వెడ్డింగ్ వేర్ ,దీపావళీ ప్రత్యేక కలెక్షన్స్ తో హై లైఫ్ బ్రీడ్స్ ఎగ్జిబిషన్ కొలువు దీరనుందని వారు తెలిపారు .
పెళ్ళి కూమార్తెకు కావాల్సిన అన్ని రకాల వస్త్ర ఉత్పత్తులు ఒకే వేదికపై అందుబాటులో ఉంచనున్నట్లు సినీ నటి వర్షిణి తెలిపారు .దేశంలోని ప్రముఖ నగరాలకు చెందిన యువ డిజైనర్లు తమ ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో ఉంచనున్నట్లు వారు తెలిపారు .
అనంతరం సరికొత్త డిజైనరీ వస్త్రాలను ప్రదర్శిస్తూ మోడల్స్ చేసిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది.