హైదరాబాద్ నోవాటెల్‌లో హై లైఫ్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన సినీ నటి రిచా ఫణి
హైదరాబాద్, మాదాపూర్
హైదరాబాదీయులు ఫ్యాషన్ ప్రియులని సినీ నటి రిచా ఫణి అన్నారు .హైదరాబాద్ హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో ఏర్పాటు చేసిన హై లైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్‌ను ఆమె ప్రారంభించారు .దేశంలోని ప్రముఖ డిజైనర్లు తయారు చేసిన పలు వస్త్ర ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి.ఈ ఎగ్జిబిషన్‌లో ఫ్యాషన్ వేర్, డిజైనర్ వేర్, ఆభరణాలు, యాక్సెసరీలు అందుబాటులో ఉంచినట్లు నిర్వహకులు తెలిపారు .
హై లైఫ్ ఆర్గనైజర్ అబీ డొమినిక్ మాట్లాడుతూ ఇది దేశంలోని టాప్ ఫ్యాషన్ లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిందన్నారు .ఫ్యాషన్ నగరమైన హైదరాబాద్‌లో హై లైఫ్ ఎగ్జిబిషన్‌ను ఆగస్ట్ 29, 30 వ తేదీలలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు . విడ్ భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని తెలిపారు .ఎక్స్‌క్లూసివ్ ఫ్యాషన్ , స్టైలిష్ ఫ్యాషన్, డిజైనర్ స్పెషల్, వెడ్డింగ్ స్పెషల్, స్టైల్, డెకార్, లగ్జరీ ఫ్యాషన్, ఆభరణాలు ఉత్పత్తులను హై-లైఫ్ ఎగ్జిబిషన్ లో అందుబాటులో ఉంచామన్నారు.