హైదరాబాద్ కొంపల్లి లో మధుర స్వీట్స్ రెండవ బ్రాంచ్ ప్రారంభం
హైదరాబాద్ కొంపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన మధుర్ స్వీట్ షోరూంనుసినీ నటి దీక్షా ఫంత్ ప్రారంభించారు.
మధుర స్వీట్స్ రెండవ బ్రాంచ్ ను తన చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని నటి దీక్ష ఫంత్ అన్నారు. హైదరాబాదులో 1965లో మొదటి షోరూంను ప్రారంభించామని మధుర్ స్వీట్స్ డైరెక్టర్ హైరని తెలిపారు. మా స్వీట్స్ షాప్ లో ప్రత్యేకంగా శిక్షణ పొందిన పాకశాస్త్ర నిపుణులతో స్వీట్స్ తయారు చేయిస్తామని ఆయన తెలిపారు . ప్రస్తుతం కొంపల్లి 2వ షోరూం ను ఏర్పాటు చేశామని వచ్చే రెండేళ్లలో 100 షోరూంలను దశలవారీగా విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు.ఫుడ్ లవర్స్ కోసం అన్ని రకాల స్వీట్స్ ను ఈ షోరూంలో అందుబాటులో ఉంచినట్లు నిర్వహకులు హైరని తెలిపారు. ఈ షో రూమ్ లో స్వీట్ ఏ కాకుండా రోడ్ సైడ్ లభించే పానీపూరి ,కట్ లెట్ , చాట్తో పాటు ఇతర ఆహార ఉత్పత్తులు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.