హైదరాబాద్ లో లిమౌసిస్ క్యాబ్ సర్వీసులను ప్రారంభించిన సినీ నటి క్యాథరిన్ థెరిసా
హైదరాబాద్,మాదాపూర్.
హైదరాబాదీ స్టార్టప్ సంస్థ లిమౌసిస్ లగ్జరీ కార్ క్యాబ్ సర్వీసులు అందించేందుకు
ముందుకు వచ్చింది. హైదరాబాద్ నోవాటెల్‌లో లిమౌసిస్ క్యాబ్స్ సర్వీసులను సినీ నటి
క్యాథరిన్ థెరిసా జెండా ఊపి ప్రారంభించారు .
లిమౌసిస్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు క్యాన్సిలేషన్ ఉండదని… ఎక్కువ సమయం వేచి చూడటం లాంటివి ఉండవని సంస్థ సీఈఓ అసద్ అహ్మద్ ఖాన్ తెలిపారు. యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు ఖచ్చితమైన సమయంలో క్యాబ్ సర్వీసులు అందిస్తామన్నారు.
హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న లిమౌసిస్ క్యాబ్స్ 2022 నాటికి వంద లగ్జరీ కార్లతో పాటు ఐదు వేల మంది ఎంట్రీలెవల్ ,మిడ్ రేంజ్ వాహనాలు,షి క్యాబ్ సర్వీసులు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. మహిళల భద్రత కోసం షీ క్యాబ్ సర్వీసులను అందిస్తున్నట్లు ఖాన్ తెలిపారు .
ఎమ్‌టిసి గ్రూప్ , లిమౌసిన్ క్యాబ్స్ సిఈఓ అసద్ అహ్మద్ ఖాన్ ఛైర్మన్ మాట్లాడుతూ మా క్యాబ్ సర్వీసులను తెలంగాణలో పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. రెగ్యులర్ క్యాబ్ క్యాన్సిలేషన్‌లు, ఎక్కువ క్యాబ్ వెయిటింగ్ టైమ్, డ్రైవర్లు డ్యూటీని తిరస్కరించడం మొదలైనవి చూశాము ఇంలాంటి సమస్యలు లేకుండా చేయడం మా ప్రధాన ఉద్దేశమన్నారు. వర్కింగ్ ఉమెన్, కొత్త విజిటర్ అయిన చాలా మంది ప్రయాణికులు, టూరిస్ట్, రెగ్యులర్ ఆఫీస్ గోయర్ మా ప్రత్యేకమైన LIMOUSINE APP తో కనెక్ట్ కావచ్చన్నారు.
ప్రయాణికులు CABS లో QR కోడ్‌ని స్కాన్ చేసి లిమౌసిన్ క్యాబ్ సర్వీసులు పొందవచ్చన్నారు.వీఐపీ, వీవీఐపీలకు ,టూరిస్ట్ లు కోరుకునే లగ్జరీ క్యాబ్ సర్వీసులను అందించేందుకు తాము ముందుకు వచ్చామన్నారు.