హైదరాబాద్ నోవాటెల్ లో హై లైఫ్ ఫ్యాషన్ డిజైనరీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సినీ నటులు సురభి పురంకిత్ ,ద్రిక్షిక చందర్
హైదరాబాద్ ,మాదాపూర్
సిటీలో ఫ్యాషన్ ఎగ్జిబిషన్లు షురూ అయ్యాయి . హైదరాబాద్ హెచ్ ఐ సీ సీ , నోవాటెల్ లో హై లైఫ్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది.
ఈ హై లైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ను ఒక్క క్షణం సినిమా ఫేం సురభి పురంకిత్ ,ద్రిక్షిక చందర్ లు ప్రారంభించారు. ఫెస్టివల్ సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఫ్యాషన్ ప్రియుల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పలువురు డిజైనర్లు రూపొందించిన దుస్తులను అందుబాటు లో ఉంచారు. ఈ ఎగ్జిబిషన్ లో వివిధ రకాల ఫ్యాషన్ జువెలరీ ఐటమ్స్,హ్యాండ్ బ్యాగ్స్, ఫుట్ వేర్ ,ఇంటీరియర్ డెకరేషన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
భారతీయ సంస్కతి సాంప్రదాయాలు ప్రతిబింబించే వస్త్రాలు ధరించడం అంటే తనకెంతో ఇష్టమని హీరోయిన్ సురభి పురంకిత్ తెలిపారు .హైదరాబాద్ నోవాటెల్ లో హై లైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ను మెడల్స్ తో కలిసి ఆమె ప్రారంభించారు. దేశంలోని ప్రముఖ డిజైనర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. .ఈ ఎగ్జిబిషన్ ఆరో తేదీ వరకు కొనసాగుతుందని ఆర్గనైజర్ అబి డొమినిక్ తెలిపారు. పండుగలు పెళ్ళిళ్ల సీజన్ దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కలెక్షన్స్ అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.