హైదరాబాద్ తాజ్‌కృష్ణాలో డిజైర్ డిజైనరీ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన సినీ నటులు శ్రీలేఖ , హర్షిణి
హైదరాబాద్ ,బంజారాహిల్స్
అందమైన ముద్దుగుమ్మలు సరికొత్త డిజైనరీ వేర్‌లో మెరిసిపోయారు .హైదరాబాద్ తాజ్‌కృష్ణాలో నేటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న డిజైర్ ఫేమస్ ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్ సినీ నటి శ్రీలేఖ, హర్షిణిలు ప్రారంభించారు .
దేశంలోని ప్రముఖ నగరాలకు చెందిన డిజైనర్లు తమ ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో ఉంచినట్లు ఆర్గనైజర్ అనిత అగర్వాల్ తెలిపారు .పండుగలు ,పెళ్ళిళ్ళ సీజన్‌ను పురస్కరించుకుని డిజైనరీ కాంటెంపరరీ జువెలరీ, స్టైలిష్ గార్మెంట్స్, దుస్తులు అందుబాటులో ఉంచామని ఆమె తెలిపారు.
దేశంలోనే ది డిజైర్ ఎగ్జిబిషన్ ప్రసిద్ధి చెందిన సంస్థ అని… ఫ్యాషన్ డిజైనర్లందరిని ఒకే ఫ్లాట్ ఫాంపైకి తీసుకువచ్చి అన్ని రకాల వస్త్ర ఉత్పత్తులను నగరాల ప్రజలకు పరిచయం చేస్తున్నట్లు ఆర్గనైజర్ అనిత అగర్వాల్ తెలిపారు.
హైదరాబాద్ తాజ్ కృష్ణాలోడిజైర్ ఎగ్జిబిషన్ ప్రదర్శన 18, 19, 20 తేదీ వరకు కొనసాగుతుందని ఆమె తెలిపారు .