హైదరాబాద్ తాజ్ కృష్ణలో పింక్ డిజైర్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన సినీనటి రిథిక
హైదరాబాద్ , బంజారాహిల్స్
భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింబించే వస్త్రాలకు అధిక ప్రాధాన్యత ఇస్తానని సినీనటి రిథిక అన్నారు .
హైదరాబాద్ తాజ్ కృష్ణాలో ఏర్పాటు చేసిన డిజైర్ లైఫ్ స్టైల్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్‌ను నిర్వహకులతో కలిసి ఆమె ప్రారంభించారు. దేశంలోని ప్రముఖ డిజైనర్లు తయారు చేసిన వస్త్ర, వజ్రాభరణాలతో పాటు గృహోపకరణా ఉత్పత్తులను ఈ ప్రదర్శన ఉంచినట్లు ఆమె తెలిపారు .పెళ్ళిళ్ళు ,శుభకార్యాలకు కావాల్సిన అన్ని రకాల డిజైనరీ వస్త్ర ఉత్పత్తులు ఒకే చోట అందుబాటులో ఉంచడం అభినందనీయమని లాస్య మంజునాథ్ అన్నారు .
హైదరాబాద్ తాజ్ కృష్ణాలో సెప్టెంబర్ 22 వ తేదీన , 23 వ తేదీన పింక్ డిజైర్ డిజైనరీ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసినట్లు చీఫ్ ఆర్గనైజర్ అనితా అగర్వాల్ తెలిపారు.
రానున్న పండుగలు, పెళ్ళిళ్ళ సీజన్‌కు కావాల్సిన అన్నిరకాల ప్రత్యేక ఫ్యాషన్ డిజైన్లు ఈ ఎగ్జిబిషన్‌లో అందుబాటులో ఉంచామన్నారు . వస్త్రాలు, నగలు, సృజనాత్మక ఉపకరాలు, ఇతర ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో ఉంచామని ఆమె పేర్కొన్నారు. కోవిద్ 19 ప్రొటోకాల్స్, మార్గదర్శకాలను అనుసరిస్తూ ఈ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నామని అనిత అగర్వాల్ తెలిపారు .అనంతరం మోడల్స్ వస్త్రాలు, వజ్రాభరణాలను ప్రదర్శిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు .
ఈ పింక్ డిజైర్ డిజైనరీ ఎగ్జిబిషన్ 23 వ తేదీ వరకు కొనసాగుతుందిన ఆర్గనైజర్ అనితా అగర్వాల్ తెలిపారు .