మదీనాగూడలో అడ్వాన్స్‌డ్ గ్రో హెయిర్ క్లినిక్‌ను ప్రారంభించిన నటుడు ఆకాష్ పూరి
టాలీవుడ్ నటుడు ఆకాష్ పూరి మదినాగూడలో సందడి చేశారు. మదీనాగుడలోని కళ్యాణ్ తులసి రామ్ ఛాంబర్స్ లో ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్ గ్రోహైర్ క్లినిక్ 8 వ బ్రాంచ్ ను ఆకాష్ పూరి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆకాష్ మాట్లాడతూ అందం ఆత్మవిశ్వాన్ని మరింత పెంచుతుందని, అందంగా కనిపించేందుకు విభిన్న అత్యాధునికి చికిత్సలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు.
అడ్వాన్స్‌డ్ గ్రోహైర్ క్లినిక్ మేనేజింగ్ డైరెక్టర్ – శరణ్ వేల్ మాట్లాడుతూ హెయిర్ గ్రోత్ చికిత్సలతో పాటు మైక్రో బ్లేడింగ్, లిప్ మైక్రోపిగ్మెంటేషన్, ఐలాష్ లిఫ్ట్ & ఎక్స్‌టెన్షన్‌లు, లేజర్ థెరపీలు వంటి కొన్ని ప్రీమియం సౌందర్య చికిత్సలను కూడా అందిస్తున్నామని, హైదరాబాద్ లో ఈ క్లీనిక్ మొదటిదని తెలిపారు.
ఫ్రాంచైజీ భాగస్వాములు అరవిందన్ జయకుమార్ , రాగిణి రావిపాటి మాట్లాడుతూ క్లినిక్ హెయిర్ రీగ్రోత్ బ్రాండ్‌గా అగ్రగామిగా ఉందని తెలిపారు.
అత్యాధునికి, సాంకేతిక చికిత్సల ద్వారా హెయిర్ గ్రోత్ , పెర్క్యుటేనియస్ FUE హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్, PRP ప్రో+, లేజర్ హెయిర్ థెరపీ, అడ్వాన్స్‌డ్ గ్రోహైర్ కాస్మెటిక్ సిస్టమ్ వంటి క్లినికల్ , నాన్-క్లినికల్ చికిత్స అందజేయనున్నట్లు వారు తెలిపారు. జుట్టు తిరిగి పెరగడం కోసం క్లినిక్ పూర్తి US-FDA ఆమోదించిన అధునాతన సేవలను అందిస్తుందన్నారు.