హైద‌రాబాద్ అత్తాపూర్ ఆదర్శ మారుతి సుజుకి అరెనా షోరూమ్‌లో బ్రెజా ఎస్.యూ.వీ కారును ఆవిష్కరించిన సినీనటుడు ఆది

మారుతి సుజికి తీసుకువ‌చ్చిన కొత్త మారుతి సుజికి బ్రెజా కారును సినీ న‌టుడు ఆది ఆవిష్క‌రించారు.

హైద‌రాబాద్ అత్తాపూర్ ఆదర్శ మారుతి సుజుకి అరెనా షోరూమ్‌లో బ్రెజా ఎస్.యూ.వీ కారును సినీనటుడు ఆది , మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ కమర్శియల్ బిజినెస్ హెడ్ అనింద్యా దత్తా, ఆదర్శ గ్రూప్ మానేజింగ్ డైరెక్టర్ విజయ్ గౌడ్‌, ఆదర్శ అరీనా సీ.ఈ.ఓ నలినీకాంత్ లు కలిసి మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో ఆది మాట్లాడుతూ..ఈ కొత్త 2022 అప్డేటెడ్ హాట్ అండ్ టెక్కీ మారుతి బ్రెజా కాంపాక్ట్ ఎస్.యూ.వీ కారును కస్టమర్ల సమక్షంలో విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. మారుతి కార్లలో ముఖ్యంగా బ్రెజా ఎస్‌.యూ.వీ కారుకు మంచి డిమాండ్ ఉందన్నారు . ఈ కొత్త బ్రెజా కారు చాలా బాగుందని తెలిపారు. ఆదర్శ గ్రూప్ మానేజింగ్ డైరెక్టర్ విజయ్ గౌడ్ మాట్లాడుతూ ఆదర్శ అత్తాపూర్ అరెనాలో ఈ కొత్త బ్రెజా కారును మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ కమర్శియల్ బిజినెస్ హెడ్ అనింద్యా దత్తా తో కలిసి మార్కెట్లోకి విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ న్యూ జనరేషన్ ఆల్ న్యూ హాట్ అండ్ టెక్కీ బ్రెజా లుక్‌లో, టెక్నాలజీలో బెస్ట్ అని తెలిపారు. కొత్త ఫీచర్స్‌తో మరోసారి విడుదలైన ఈ 2022 బ్రెజాకి క‌స్ట‌మ‌ర్ల‌కు మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు. ఈ కొత్త బ్రెజా కారు పెట్రోల్ వెర్ష‌న్ అందుబాటులో ఉంటుందన్నారు. ఇందులో 9 ఇంచ్ ఇన్ఫోటెయిన్‌మెంట్ సిస్టం, ఆర్క్‌మేస్‌ సౌండ్‌ సిస్టం, ఆటోమాటిక్‌ ట్రాన్స్‌మిషన్‌, పాడిల్ షిఫ్టర్స్‌, వైర్లెస్‌ ఫోన్‌ చార్జింగ్, హెడ్‌ అప్‌ డిస్ల్పే,సన్‌రూఫ్,360 డిగ్రీస్‌ కెమెరా, 6 ఎయిర్ బ్యాగ్స్,ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్,హిల్‌ హోల్డ్ అసిస్ట్, ఎ.బి.ఎస్ విత్ ఈ.బీ.డీ లాంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. దీని ప్రారంభ ధర 7 లక్షల 99 వేలుగా ఉంద‌న్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ రవీందర్, షోరూం సిబ్బంది , కస్టమర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *