ద హాత్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ఎంతగానో ఆకట్టుకుంటుంది : సోనియా సురేష్
ఫ్యాషన్ ప్రియుల అభిరుచులకు అనుగుణంగా రూపొందించిన వస్త్ర ఉత్పత్తులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని వర్థమాన నటి సోనియా సురేష్ అన్నారు . హైదరాబాద్ తాజ్ కృష్ణలో ద హాత్ పేరుతో ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనను టాలీవుడ్ వర్ధమాన నటి సోనియా నరేష్, తో పాటు సోషలైట్ మరియు జాయ్ ప్రెనూర్ (Joypreneur) పద్మజా పెన్మెట్సాలు ప్రారంభించారు. ఫ్యాషన్ లో కొత్తదనం కోరుకునే మగువలకు ద హాత్ బెస్ట్ ఫ్లాట్ ఫాం అన్నారు.
ది హాత్ – ప్రీమియమ్ హెరిటేజ్ ఫ్యాషన్ & లైఫ్ స్టైల్ వస్త్రోత్పత్తుల ప్రదర్శన మూడు రోజులపాటు హైదరాబాద్ బంజారా హిల్స్ లోని తాజ్ కృష్ణ లో కొనసాగుతుంది. ఫ్యాషన్ ప్రియులకోసం దేశం లొని అనేక నగారాల మహిళలు వ్యాపారవేత్తలు డిజైనర్ల లను ఓకే వేదికలో ఏర్పాటు చెయడం అభినందనీయం ఆని పద్మజా పెన్మెట్సా అన్నారు.
ఫ్యాషన్ లో నిత్యం కొత్త దనం కోరుకునే మగువల కోసం “ది హాత్” ప్రదర్శన లో ప్రస్తుత ఫ్యాషన్ ట్రెండుకు అనుగుణమైన సేకరణలతో భారతీయ దుస్తులు, డిజైనర్ వేర్, వెస్ట్రన్ , ఇండియన్ అప్పారెల్, హ్యాండ్లూమ్స్, డిజైనర్ జ్యువెలరీ తో పాటు గృహోపకరణాలు, పాదరక్షలు వంటి వేలాది రకాల ఉత్పత్తులు ఒకే వేదిక లో ఏర్పాటు చేశామని నిర్వాహకులు అనుపమ్ ముఖర్జీ చెప్పారు.
ప్రదర్శన ఈ నెల 18 తేదీ వరకు కొనసాగుతుంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, లక్నో, అహ్మదాబాద్, ఇండోర్, పూణ్, సూరత్, వారణాసి, యుపి, వడోదరా, కోల్కతా, పంజాబ్, జైపూర్, హైదరాబాద్ల నుంచి దేశవ్యాప్తంగా డిజైనర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని వారు తెలిపారు.