రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల కట్టడి కి చర్యలు

దిశ చట్టం అమలుకు సంబంధించి కేంద్ర ఆమోదానికి సిఫార్సులు కోరుతూ ఏపీ మహిళా కమిషన్ తరపున గవర్నర్ కి విజ్ఞప్తి

మహిళలకు సత్వర న్యాయం జరగాలంటే దిశ చట్టం ని కేంద్రం సత్వరమే ఆమోదించాలి

విజయవాడ : రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా క్షేత్రస్థాయిలో మహిళలకు సంబంధించిన విషయాలు తమరి దృష్టిలో ఉంచే ప్రయత్నం చేస్తున్నాము.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన మహిళా సాధికారతకు ఎనలేని కృషి చేస్తుంది. సమస్యలతో సతమతమయ్యే బాధిత మహిళలకు రాష్ట్రంలో అమలయ్యే ‘దిశ’ చట్టం గొప్ప భరోసాగా నిలిచింది. ఆ దిశ చట్టం స్ఫూర్తితో నిర్ణీత వ్యవధిలో క్రిమినల్ కేసుల్లో కోర్టులకు ఛార్జిషీట్లు దాఖలు చేయడం, వేగవంత విచారణతో నేరస్తులకు శిక్షలు ఖరారవుతున్నాయి. గడచిన మూడున్నరేళ్ళలుగా
మహిళలు, బాలికలపై వేధింపులు, హత్యలు, అత్యాచారాలు చాలావరకు కంట్రోల్ లోకి వచ్చాయి. నిర్భయ, ఫోక్సో చట్టం కింద బాధితులకు సత్వర న్యాయం జరగాలంటే ‘దిశ’ చట్టం అమలు శరవేగమవ్వాలి. ఇందుకు కేంద్రప్రభుత్వం ఆమోద ముద్ర వేయాలి. త్వరితగతిన నిందితులకు శిక్షలు పడాల్సి ఉంది. మహిళల భద్రతా రక్షణకు సంబంధించి ‘దిశ’ చట్టం ఆమోదంతో అమలుకు గవర్నర్ ద్వారా కేంద్రప్రభుత్వానికి సిఫార్సులు పంపగలరని ఏపీ మహిళా కమిషన్ తరపున కోరుతున్నాము. గవర్నర్ ని కలిసిన వారిలో ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు బూసి వినీత, గజ్జల లక్ష్మి ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *