పరవాడ పరిశ్రమలో ప్రమాదం.. ఒకరి మృతి..!
ఏపీలోని పరవాడ పరిశ్రమలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదవశాత్తు జరుగుతున్న ఈ ప్రమాదాల్లో కార్మికులు మృత్యువాత పడుతుండడంతో కార్మిక వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. వారం రోజుల క్రితం అనకాపల్లి పరవాడ ఫార్మాసిటీలోని కంపెనీలో ప్రమాదం జరిగి నలుగురు మృత్యువాత పడిన ఘటనను మరిచిపోక ముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ పరవాడ ఫార్మాసిటీలోని నెహ్రూ ఫార్మాసిటీ స్రైల్ ఎక్స్ ఫార్మా కంపెనీలో పెయింటర్‌గా పనిచేస్తున్న పైడిరాజు అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ఈ ఘటనలో అప్పారావు అనే కార్మికుడికి తీవ్రగాయాలు కావడంలో హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
