హైదరాబాద్ ఎఎస్ రావు నగర్‌లో 11వ అవుట్‌లెట్‌ను ప్రారంభించిన అబ్సల్యూట్ బార్బెక్యూస్
భారతదేశంలో ఎబిస్‌గా ప్రసిద్ది చెందిన ఆహార ప్రియులు ఎంతగానో ఇష్టపడే బిబిక్యూ బఫే రెస్టారెంట్ అబ్సల్యూట్ బార్బెక్యూస్, హైదరాబాద్‌లో తన 11వ అవుట్‌లెట్‌ను ఎంతో రద్దీగా ఉండే ఎఎస్ రావు నగర్‌లో ప్రారంభించడం ద్వారా మరో మైలురాయిని చేరుకుంది.
యాప్రాల్‌లోని స్వచ్చంద సంస్థకు చెందిన ఓమీస్ హోమ్ ఫర్ చిల్డ్రన్‌కు చెందిన చిన్నారులు ఈ అవుట్‌లెట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఎఎస్ రావు నగర్‌లో ఏర్పాటైన ఈ నూతన ఎబిస్, ఎఎస్ రావ్ నగర్ మరియు దాని పరిసర ప్రాంతాలలో ఉండే ఆహార ప్రియులను ఆకర్షించడానికి ఖరీదైన మరియు ప్రీమియం ఇంటీరియర్‌తో సర్వసన్నద్దమైంది. రెస్టారెంట్ 108 సీటింగ్ సామర్ద్యంతో ఎంతో విశాలంగా ఉన్నది.
హైదరాబాద్ నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఎబిస్, నగరంలో తన పదకొండవ అవుట్‌లెట్‌ను ప్రారంభించడం మాకు ఎంతో ముఖ్యమైన సందర్భం. హైదరాబాద్‌లోని మంచి ఆహార అభిరుచులు కలిగిన ఆహార ప్రియులు ఎల్లప్పుడూ ఎబిస్‌ను ఆదరించి, ఎబిఎస్ ఒక జాతీయ బ్రాండ్‌గా మారడంలో మమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహిస్తున్నారు.
కాస్మోపాలిటన్ జనాభా మంచి వాతావరణం కలిగిన ఎఎస్ రావు నగర్‌లో ఎబిస్‌కు భవిష్యత్తులో ఆదరణ బాగా ఉంటుదని మేము ఎల్లప్పుడూ భావిస్తూ వచ్చాము మరియు ఎఎస్ రావు నగర్ పరిసరాల్లో ఒక అవుట్‌లెట్ ఉండాలనే ఆ ప్రాంతానికి చెందిన ఆహార ప్రియుల నుండి పెరుగుతున్న డిమాండ్ మా నిర్ణయాన్ని మరింత వేగవంతంగా అమలు చేయడంలో మమ్మల్ని ప్రేరేపించింది. ఎబిస్ విష్ గ్రిల్ కాన్సెప్ట్‌కు ప్రసిద్ధి చెందాయి, ఇక్కడ మీరు మీ మరియు మీ కుటుంబ సభ్యుల అభిరుచికి అనుగుణంగా ఆహారాన్ని సిద్ధం చేసి అందించవచ్చు. ఎబిస్ అన్ని రకాల వేడుకలకు కూడా ప్రసిద్ధి చెందాయి, పుట్టిన రోజు, పెళ్లి వార్షికోత్సవం లేదా సహ`ఉద్యోగులతో విందు వంటి ఎటువంటి సందర్భమైనా కావచ్చు, అటువంటి ముఖ్యమైన సందర్భాలు జరుపుకునే ప్రత్యేకత కారణంగా, ఎబిస్ సేవలకు నగరంలో చర్చనీయాంశంగా మారింది, చాలా మందికి ఇంటి నుండి దూరంగా ఉన్న మరో ఇల్లులా ఉంటుంది, ఇక్కడ మేము మా అతిథులను ఇళ్లలో చేసినట్లుగా వారి జిహ్వ చాపల్యాన్ని సంతృప్తి పరుస్తాము. మొత్తంమీద ఎబిస్ ఆకట్టుకునే భోజన అనుభవం అందిస్తుంది, ఇది మా కస్టమర్లకు ఆనందాన్ని కలిగిస్తుంది, ఇది మా 60వ ఔట్‌లెట్, మరో 40 ఔట్‌లెట్లను ప్రారంభించి ఈ ఆర్దిక సంవత్సరాంతానికి మొత్తం 100 ఔట్‌లెట్లకు చేరుకోవాలనేది మా ఆకాంక్ష ఎబిస్ – ఎపి & టిఎస్, టెరిటరీ మేనేజర్ ఆపరేషన్స్, అభిలాష్ కుమార్ యలమంచిలి అన్నారు.
‘‘ఎబిస్‌కు పెరుగుతున్న జనాదరణ వలన భారతదేశంలో సుమారుగా రూ.10000 కోట్లుగా అంచనా వేయబడి సముచితమైన బార్బెక్యూ రెస్టారెంట్ల మార్కెట్‌లో మా నెట్‌వర్క్‌ను మరింత వేగంగా విస్తరించడానికి మమ్మల్ని ప్రోత్సాహించింది. ఏదేమైనప్పటికీ, హైదరాబాద్ నగరం నుండి వచ్చిన ఎబిస్ మాకు అత్యధిక ప్రాధాన్యమైనదిగా కొనసాగుతున్నది. ప్రస్తుతం నగరంలో ఏర్పాటైన పది అవుట్‌లెట్‌లు దీనిని నిర్ధారిస్తాయి. ఎబిస్‌లో కస్టమర్లకు ఎంతో ఇష్టమైన రుచికరమైన పదార్ధాలు అందుబాటులో ఉంటాయి. మా ప్రస్తుత అవుట్‌లెట్‌లన్నీ పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయి మరియు మరిన్నింటికి డిమాండ్ ఉంది మరియు ఎబిస్ యొక్క అవుట్‌లెట్ అవసరాన్ని తీర్చడానికి మేము మరిన్ని ప్రాంతాలను అన్వేషిస్తున్నాము. త్వరలో అత్తాపూర్ మరియు కూకట్‌పల్లి ప్రారంభించాలనుకుంటున్నాము మరో మూడేళ్లలో ఐపిఒ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్)కు వెళ్లాలని భావిస్తున్నామని ఎబిస్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, రీతేష్ గడే తెలిపారు.
ఆతిథ్యంలో అత్యుత్తమ అర్హత నైపుణ్యాలు కలిగిన హోటల్ సిబ్బంది, వాలెట్ పార్కింగ్, డిఐవై గ్రిల్, విష్ గ్రిల్ మరియు ప్రత్యేక కౌంటర్లు మరియు వీటన్నింటితో పాటు ఎబిస్ తన వ్యక్తిగతీకరించిన సేవా వ్యవస్థను ఈ అవుట్‌లెట్ ద్వారా సరికొత్త ప్రమాణాలకు తీసుకువెళుతుంది. అబ్సల్యూట్ బార్బెక్యూల పాకశాస్త్ర తత్వాన్ని దృష్టిలో ఉంచుకుని అవుట్‌లెట్ ఎంతో నిశితంగా రూపొందించబడిరది. విష్ గ్రిల్‌లో బ్రెజిలియన్ చురాస్కోతో కూడిన అనేక రకాల పరదేశీ మాంసాలు, భారతీయ / ఖండాంతర మెయిన్‌లతో పాటు పెద్ద సంఖ్యలో వివిధ రకాల స్టార్టర్‌లు, కోల్డ్ స్టోన్ క్రీమరీ మరియు చక్కటి డెజర్ట్‌ల ఎంపికతో, ఎబిస్ ప్రతి ఒక్కరికీ ఇష్టమైన దానిని అందిస్తుంది.
అవుట్‌లెట్‌ని +91 733 7383 763 కు ఫోన్ చేయడం ద్వారా లేదా www.absolutebarbecues.com ద్వారా చేరుకోవచ్చు.
అబ్సల్యూట్ బార్బెక్యూ ప్రైవేట్ లిమిటెడ్ గురించి:
అబ్సల్యూట్ బార్బెక్యూస్, బిబిక్యూ బఫే రెస్టారెంట్ చైన్ ప్రధాన కార్యాలయం భారతదేశంలోని హైదరాబాద్‌లో ఉంది. 2013లో రెస్టారెంట్ ప్రొసెంజిత్ రాయ్ చౌదరి తన సహ వ్యవస్థాపకుడు మాధవన్ గురుదాస్‌తో కలిసి ప్రారంభించారు. బ్రాండ్ భారతదేశంలో 50 అవుట్‌లెట్‌లను కలిగి ఉంది మరియు 20 నగరాలను కవర్ చేస్తుంది. రెస్టారెంట్ చైన్ దుబాయ్‌లో మూడు అవుట్‌లెట్‌లతో అంతర్జాతీయ ఉనికిని కలిగి ఉంది. భారతదేశపు మొదటి విష్ గ్రిల్ రెస్టారెంట్ అనే క్రెడిట్‌తో, ఎబిస్ భారతీయ, కాంటినెంటల్ మరియు అన్యదేశ ఆఫర్‌లను కలిగి ఉన్న ఆల్-యు-కెన్-ఈట్ బఫేను అందిస్తుంది. రెస్టారెంట్ టైమ్స్ ఫుడ్ అవార్డ్స్, అత్యధిక రేటింగ్ పొందిన రెస్టారెంట్‌కి జోమాటో యూజర్ పాపులారిటీ అవార్డు మరియు గోల్డెన్ ప్లేట్ అవార్డులతో సహా పలు అవార్డులను కూడా గెలుచుకుంది.