ఆగస్ట్31 లోగా పీఎఫ్ అకౌంట్ నెంబర్ కు అధార్ అనుసంధానం చేసుకోవాలి
ప్రావిడెడ్ ఫండ్ ( పీఎఫ్ )చందాదారులు యూఏఎన్ (UAN)నంబర్‌తో తమ ఆధార్ నెంబర్ ను అనుసంధానం చేసుకోవాలని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ సూచించింది .ప్రతి పీఎఫ్ ఖాతాదారుడు ఆగస్టు 31లో ఆధార్‌ను జత చేయాలని పేర్కొంది. యూఏఎన్ నెంబర్ కు ఆధార్ నెంబర్ ను అనుసంధానం చేసుకోకపోతే సెప్టెంబర్ 1 నుంచి పీఎఫ్‌కు సంబంధించి ఎలాంటి సేవలూ పొందలేరని తేల్చి చెప్పింది. యాజమాన్యాలు పీఎఫ్ మొత్తాలను జమయడం , పీఎఫ్‌కు సంబంధించి చందాదారులు సైతం నగదును ఉపసంహరించుకోలేరని తెలిపింది.
కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ సోషల్ సెక్యూరిటీ కోడ్ కింద ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలుత ఈపీఎఫ్ ఖాతాకు ఆధార్ జత చేయడానికి ఈపీఎఫ్‌వో జూన్ 1 వరకు గడువు విధించింది. తాజాగా సెప్టెంబర్ 1 వరకు పొడిగించింది. ఇది వరకే మీరు ఆధార్‌తో మీ పీఎఫ్ ఖాతాను జత చేసి ఉంటే మరోసారి ధ్రువీకరించుకోవాలని కోరింది.
ముందుగా ఈపీఎఫ్ ఓ పోర్టల్ కు వెళ్ళి యూజర్ నేమ్ , పాస్ వర్డ్ తో లాగిన్ కావాల్సి ఉంటుంది .మెను బార్ లో మేనేజ్ అప్షకు వెళ్తే ….అక్కడ అప్షన్స్ ఉంటాయి. ఈపీఎప్ వో తో అధార్ అనుసంధానం అనే అప్షన్ ఉంటుంది. అక్కడ అధార్ నెంబర్ ను జతచేయాలి .