స్విట్జర్లాండ్ లో మంత్రి కేటీఆర్ బృందానికి ఘన స్వాగతం
స్విట్జర్‌లాండ్ లోని దావోస్‌లో జనవరి 16 నుండి 20వ తారీఖు వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి జ్యూరిక్ చేరుకున్న తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారికి జ్యూరిక్ విమానాశ్రయంలో ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు.

జ్యూరిక్ నగరంలోనే కాక, స్విట్జర్‌లాండ్‌లోని ఇతర నగరాలు, యూరోప్‌లోని ఇతర దేశాల నుండి వచ్చిన ఎన్నారైలు విమానాశ్రయంలో మంత్రికి స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో స్విట్జర్‌లాండ్ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు శ్రీధర్ గండె, ఇతర తెలుగు సంఘాల ప్రతినిధులు ఉన్నారు.
జ్యూరిక్ నగరంలో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన “మీట్ ఎండ్ గ్రీట్” కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. రేపు దావోస్ చేరుకొని వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొంటారు.