చెన్నైలోని బీచ్ స్టేషన్ లో ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకొచ్చిన రైలు.
పరుగులు పెట్టిన ప్రయాణీకులు.
చెన్నై
చెన్నైలోని బీచ్ స్టేషన్‌లో సబర్బన్ రైలు ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకువచ్చింది. చెన్నై వర్క్‌షాప్ నుంచి కోస్టల్ రైల్వేస్టేషన్ వెళ్తున్న సమయంలో నియంత్రణ కోల్పోయి భారీ శబ్దంతో ప్లాట్‌ఫామ్ వైపు దూసుకువచ్చింది. దీంతో అక్కడ ఉన్న వారంతా పరుగులు పెట్టారు. రైలులో ఉన్న పలువురు ప్రయాణికులు సైతం రైలు నుంచి బయటకు దూకారు .ఈ ప్రమాదంలో ప్రయాణీకులెవరికీ గాయాలు కాలేదని, రైలు డ్రైవర్ మాత్రం గాయపడ్డాడు. ఆయనను రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఆదివారం సెలవు దినం కావడంతో బీచ్ స్టేషన్ లో ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉంది. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.