వైసీపీకి షాక్.. జనసేనలోకి భారీగా చేరికలు

ఏపీలో అధికాపార్టీకి వరుష షాకులు తగులుతున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో.. ఆ పార్టీ నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. తాజాగా.. వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి పలువురు కీలక నేతలు చేరారు. ఆదివారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు బొంతు రాజేశ్వరరావును పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాజేశ్వరరావు రాజోలు నుంచి వైసీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. వైసీపీ ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించారు. రాజేశ్వర రావు తన అనుచరులతో కలిసి జనసేనలో చేరారు. విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గురాన అయ్యలుకి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువా వేశారు. పి.గన్నవరం నియోజకవర్గం నుంచి నగరం ఏఎంసీ ఛైర్మన్ కొమ్మూరి కొండలరావుకి పవన్ కళ్యాణ్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.