హైదరాబాద్ సోమాజీగూడ మెర్క్యూర్ హోటల్ లో వినూత్నమైన థాయ్ వంటకాల పండుగ
హైదరాబాద్
దేశీయ వంటకాలతో పాటు విదేశీ వంటకాల రుచులు అందించేందుకు పలు హోటల్స్ ,రెస్టారెంట్స్ ముందుకు వస్తున్నాయి. హైదరాబాద్ సోమాజీగూడలోని మెర్క్యూర్ హోటల్ లోని టెర్రస్, రూఫ్ టాప్ రెస్టారెంట్ లో వినూత్నమైన థాయ్ వంటకాలతో కూడిన ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు.
ఈ ఫుడ్ ఫెస్టివల్ ఈ నెల 22 తేదీ నుండి ఆగష్టు ఆరో తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. ప్రతి రోజు రాత్రి డిన్నర్ సమయంలో 7.00 గంటల నుండి 11.00 గంటల వరకూ ఈ ధాయ్ ఫుడ్ ఫెస్టివల్ లో ధాయ్ లాండ్ కు చెందిన ప్రత్యేకమైన రుచులు భోజన ప్రియులను అలరించనున్నాయి. థాయ్ లాండ్ కు చెందిన వివిధ ప్రాంతాల నుండి ఎంపిక చేసిన వంటకాలతో తయారు చేసిన మెనూ అందుబాటులో ఉంచారు. తాను స్వయంగా రుచి చూసి ఆస్వాదించిన రుచులతో ఏరి కోరి ఎంపిక చేసిన ధాయ్ సాంప్రదాయ వంటకాలను మెనూలో చేర్చి అందించడం జరుగుతుందని మాస్టర్ ఛెఫ్ గణేష్ తెలిపారు .
వారం రోజుల పాటూ సాగే ఈ ఫెస్టివల్లో వెజ్ ,నాన్ వెజిటేరియన్స్ కోసం పసందైన వంటకాలు మెనూలో ఉంచారు . వాటిలో శాఖాహారులకోసం Harmokthoo (అరటి ఆకులలో చుట్టబడి స్టీమ్ పై వండిన టోఫు), Khao Pot Phadpriktaosi (బ్లాక్ బీన్స్ మరియు మిర్చిని కలిపి వోక్ తో వేయించిన బ్రొకోలి, బేబీ కార్న్ మరియు మష్ రూమ్) మరియు మాంసాహారుల కోసం Pla Yang Namprik (ఘాటైన చిల్లీ సాస్ లో డీప్ ఫ్రై చేయబడిన బేబీ పొంఫ్రెట్), Satay Koong (పలు రకములైన డిప్స్ లేదా సాస్ లతో అందించే పాన్ లో వేయించిన రొయ్యలు) వంటి స్టార్టర్స్ మెనూలో ఉన్నాయి.
అంతే గాకుండా ఛెఫ్ తన వంటకంగా అందించే Thung Thong (పలు రకములైన కూరగాయలు లేదా చికెన్ తో కలిపి వేయించిన వాంటన్స్) తో పాటూ శాఖాహారులకు Tom Kha (థాయ్ కోకోనెట్ సోర్ సూప్) మరియు మాంసాహారులకు Tom Yum (థాయ్ హాట్ అండ్ సోర్ సూప్) లు మెనూలో చేర్చబడ్డాయి.
ఇక మెయిన్ కోర్సులో Gaengpaa అనబడే దక్షిణ థాయ్ శైలి లో వండబడిన కూర (మాంసాహారుల కోసం రొయ్యలు, చికెన్ తో కూడిన కూర అయితే శాఖాహారుల కోసం పలు రకములైన కూరగాయలతో) ను జాస్మిన్ రైస్ తో పాటూ అందించడం జరుగుతుంది. దీనితో పాటూ Gaengkiew Warn అనబడే థాయ్ గ్రీన్ కర్రీ (మాంసాహారుల కోసం రొయ్యలు, చికెన్ తో కూడిన కూర అయితే శాఖాహారుల కోసం పలు రకములైన కూరగాయలతో) ను జాస్మిన్ రైస్ తో పాటూ అందించడం జరుగుతుంది; Khaophadnamprikphao అనబడే ప్రత్యేకమైన థాయ్ కర్రీ పేస్ట్ లో చేయబడిన జాస్మిన్ రైస్ ను (మాంసాహారుల కోసం రొయ్యలు, చికెన్ తో కూడిన కూర అయితే శాఖాహారుల కోసం పలు రకములైన కూరగాయలతో) అందించడం జరుగుతుంది.
ఇక ఈ భోజన ప్రయాణం చివరగా ప్రత్యేకమైన థాయ్ డెజర్ట్ Kluaythod (తేనె మరియు ససేమ్ తో కూడిన అరటికాయ ఫ్రిటర్స్ తో రూపొందించిన) మెనూ భాగంగా ఉంటుంది.
థాయ్ ఫుడ్ లో వెజ్ ,నాన్ వెజ్ వంటకాలు అందిస్తున్నట్లు మెర్క్యూర్ హోటల్ F&B మేనేజర్ రమాకాంత్ తెలిపారు. ఫెస్టివల్ ద్వారా హోటల్ మెర్క్యూర్ లో ఎంతో ప్రత్యేకత కలిగిన వంటకాలను అందిస్తామనే వాగ్దానాన్ని నిలబెట్టుకొంటున్నట్లు తెలిపారు.