గ్లెన్‌డేల్ అకాడమీ విద్యార్థుల అద్భుత నాటక ప్రదర్శన.

ఆకట్టుకున్న “బట్ వేర్ ఈజ్ మిసెస్ టార్రాగన్” నాటకం.

సన్ సిటీ క్యాంపస్‌లో జరిగిన గ్లెన్‌డేల్ వార్షిక నాటకం

హైదరాబాద్

హైదరాబాద్ లోని సన్ సిటీ క్యాంపస్‌లో గ్లెన్‌డేల్ అకాడమీ విద్యార్థులు “ది మర్డరస్ మాన్షన్ ఆఫ్ మిస్టర్ యునో” అనే నాటకాన్ని ప్రదర్శించారు. ఈ థ్రిల్లర్ నాటిక పాఠశాల డ్రామా సొసైటీచే నిర్వహించబడే గ్లెన్‌డేల్ అకాడమీ యొక్క 9వ వార్షిక నాటకం. ఈ నాటకం నిత్యం జరిగే అన్ని థ్రిల్లర్ నాటకాలపై వ్యంగ్యంగా ఉంది. ఈ నాటకానికి డాక్టర్ అభిమన్యు ఆచార్య దర్శకత్వం వహించగా, నిర్మాతగా మిను సలూజా వ్యవహరించారు. గ్లెన్‌డేల్ అకాడమీ ప్రదర్శించిన ఈ నాటకం చాలా ఆసక్తికరంగా కొనసాగింది. గ్లెన్‌డేల్ అకాడమీ దత్తత తీసుకున్న కనకమాడి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు ఈ నాటకానికి వచ్చే ఆదాయంతో పలు అభివృద్ది పనులు చేపట్టనున్నారు.

నాటికానికి దర్శకత్వం వహించిన (యుజిసి ప్రొఫెసర్) డాక్టర్ అభిమన్యు ఆచార్య మాట్లాడుతూ “గ్లెన్‌డేల్ స్కూల్‌లోని డ్రామా సొసైటీతో అనుబంధం కలిగి ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. డ్రామా సొసైటీలో భాగం కావడం ఒక వ్యక్తిని దృఢంగా మరియు సంపూర్ణంగా చేస్తుంది. విద్యార్థులు మంచి వక్తలుగా తయారవుతారు. ముందస్తుగా ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ఏ అంశంపైనైనా ధారాళంగా మాట్లాడగలరు. గ్లెన్‌డేల్ విద్యార్థులు అనేక డిబేట్ పోటీలలో బహుమతులు గెలుపొందారు. కొన్ని అసాధారణమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలను ప్రదర్శించారు. పాఠశాలలో చదువుతున్న రోజుల్లో థియేటర్‌లో చేరిన చాలా మంది ఇప్పుడు విశ్వవిద్యాలయాలలో టాపర్‌లుగా ఉన్నారు. వారి జీవితంలో గొప్ప విజయాన్ని సాధించారు”.

గ్లెన్‌డేల్ అకాడమీ డైరెక్టర్ డా.అంజూమ్ బాబుఖాన్ మాట్లాడుతూ పూర్వ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మాజీ మంత్రిగా పనిచేసిన గౌరవ వ్యవస్థాపకుడు బాబూఖాన్‌కు నాటకరంగం, కవిత్వం, వక్తృత్వం అంటే చాలా మక్కువ. థియేటర్ ఆర్ట్స్‌లో పాల్గొనడం వల్ల విద్యార్థుల కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి. నాటకంలో నటించడానికి చాలా తెలివితేటలు, సృజనాత్మకత మరియు సమన్వయం అవసరం. డ్రామాను ప్రదర్శించే ప్రక్రియలో విద్యార్థులు ఈ లక్షణాలన్నింటినీ నేర్చుకుంటారు. గ్లెన్‌డేల్ వద్ద మేము విద్యార్థుల అభివృద్ధికి సమగ్ర విధానాన్ని కలిగి ఉన్నాము. యోగా, డ్యాన్స్, ఆర్ట్ మరియు క్రాఫ్ట్ వంటి కార్యకలాపాలు సాధారణ పాఠ్యాంశాల్లో చేర్చబడ్డాయి, తద్వారా విద్యార్థుల వ్యక్తిత్వం పూర్తిగా అభివృద్ధి చెందుతుంది.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన డిప్యూటీ హైకమిషనర్‌ ముఖ్య ఆర్థిక సలహాదారు నళినీ రఘురామన్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోనూ ఇంగ్లీషు నాటకాలు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ అంజుమ్ బాబుఖాన్ అన్నట్లుగానే థియేటర్ మరియు డ్రామాటిక్స్ విద్యార్థి తన అభిప్రాయాన్ని ఆత్మవిశ్వాసంతో వ్యక్తీకరించడంలో సహాయపడతాయి. ఒక నాటకానికి చాలా నిర్వహణ మరియు సమన్వయ నైపుణ్యాలు కూడా అవసరం. అందువల్ల విద్యార్థి ఈ రకమైన ఈవెంట్‌లలో పాల్గొనడం ద్వారా నిజంగా ప్రయోజనం పొందగలడు. నేను గ్లెన్‌డేల్‌ను నిజంగా అభినందించాలనుకుంటున్నాను. ఇలాంటి గొప్ప కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు అకాడమీ ప్రత్యేక ధన్యవాదాలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *