అకౌంటింగ్ వృత్తికి ఉజ్వల భవిష్యత్తు : ICAI ఉపాధ్యక్షుడు అనికేత్ సునీల్ తలాటి
దేశంలో అకౌంటింగ్ వృత్తికి ఉజ్వల భవిష్యత్తు ఉందని.. ఈ రంగంలో అపారమైన అవకాశాలు పుట్టుకొస్తాయని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ( ICAI) ఉపాధ్యక్షుడు అనికేత్ సునీల్ తలాటి అన్నారు.హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ICAI 24వ దక్షిణ భారత ప్రాంతీయ మండలి, ఇతర ప్రాంతీయ శాఖలకు కొత్త కార్య వర్గాలకు ఎన్నికలు నిర్వహించారు. మూడేళ్లకు ఒకసారి జరిగే ఓరియంటేషన్ తరగతులు నిర్వహించారు. దక్షిణ భారత ప్రాంత మండలి, విభాగాల నూతన కార్యవర్గ లకు రెండు రోజుల పాటు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమం రామోజీ ఫిలింసిటీలో ముగిసింది. ఈ కార్యక్రమానికి ICAI కేంద్ర కమిటీ సభ్యులు, దక్షిణ భారత ప్రాంతీయ మండలి, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరికి చెందిన 45 మేనేజింగ్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ICAI దక్షిణ భారత మండల చైర్మన్ తలకాయల చిన్న మస్తాన్, ఉపాధ్యక్షుడు ఎస్ .పన్న రాజ్, కోశాధికారి ఆర్ .సుందరరాజన్, కార్యదర్శి గెళ్లి నరేష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు