హైదరాబాద్ హైటెక్స్ లో ఆగస్ట్ 27 వతేదీ నుంచి 9వ కేబుల్ నెట్ ఎక్స్ ఫో విజన్ 2021

హైదరాబాద్ ,సోమాజీగూడ

ప్రతి ఏటా  అత్యంత ప్రతిష్ట్రాత్మకంగా నిర్వహిస్తున్న కేబుల్ నెట్ ఎక్స్ షో విజన్ 2021కు హైదరాబాద్ వేదిక అయింది. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో  సి ఎన్ సి గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కేబుల్ నెట్ ఎక్స్ ఫో విజన్ 2021 వివరాలను తెలంగాణ ఎమ్మెస్వోల సంఘం అధ్యక్షులు సుభాష్ రెడ్డి వెల్లడించారు.

హైదరాబాద్ హైటెక్స్ లో  ఆగస్ట్ 27 తేదీ నుంచి 30 వ తేదీ వరకు  మూడురోజుల పాటు జరగనున్న ఈ కేబుల్ ఎగ్జీ బిషన్ ను  తెలంగాణ సాంస్కృతిక క్రీడల శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు .ఈ ఎగ్జిబిషన్ లో . మొత్తం 175  కుపైగా ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్లు ఆయన తెలిపారు.  జాతీయ, అంతర్జాతీయ సంస్థలు హార్డ్ వేర్, సాప్ట్ వేర్ ,మిడిల్ వేర్ ,ఇ పీ జీ, కాస్, ఎస్ ఎం ఎస్ , కేబుల్ బిల్లింగ్ మిషన్, ఫైబర్ , కొయాక్సియల్ ,డిజిటల్ హెడ్ ఎండ్ ,ఐపీటీవీ, హిట్స్ ,టెలికాం కంపెనీలు పాల్గొంటాయని తెలంగాణ రాష్ట్ర ఎమ్ ఎస్ వో ల సంఘం అధ్యక్షుడు సుభాష్ రెడ్డి అన్నారు.

కార్పొరేట్ కంపెనీల కు ధీటుగా టెక్నాలజీని అందిపుచ్చుకుని వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి ఈ ఎగ్జిబిషన్ దోహదపడుతుందన్నారు . రెండు తెలుగు రాష్ట్రాల్లోని  కేబుల్ ఆపరేటర్లు పాల్గొని కేబుల్ ఎక్స్ ఫో విజన్ ను విజయవంతం చేయాలని సుభాష్ రెడ్డి కోరారు. బ్రాడ్ బాండ్ ద్వారా ఆదాయం పెంచుకోవాలని నిర్ణయించామని,దాదాపు పదిహేను వేల మంది సందర్శకులు వస్తారని అంచానా వేసినట్లు ఆయన తెలిపారు .

కేబుల్ రంగాన్ని పరిశ్రమ గా గుర్తించి ప్రభుత్వం  ఆదుకోవాలని కేబుల్ ఆపరేటర్లు సంక్షేమ సంఘం అధ్యక్షుడు జితేందర్ తెలిపారు.ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్లు కోసం కార్పొరేషన్ ను ఏర్పాటు చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త టారిఫ్ విధానం ద్వారా కేబుల్ ఆపరేటర్లు  కు నష్టం వాటిల్లుతుందని జితేందర్ పేర్కొన్నారు.

ఎగ్జిబిషన్ ఆవరణంలో సెమినార్లు నిర్వహిస్తామని సీఎంసీ ఛైర్మన్ రాము తెలిపారు. పరిశ్రమల్లోనూ, టెక్నాలజీ పరంగాను వస్తున్న మార్పులను చర్చించే లక్ష్యంతో సెమినార్లు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు .ఎంఎస్ఓలకు పరిశ్రమల్లో అమలు అవుతున్న విధానాలు, పరిశ్రమ భవిష్యత్ , ప్రభుత్వ విధానాలపై అవగాహన, కొత్త టారిఫ్ విధానంతదితర అంశాలపై సెమినార్ లో చర్చించనున్నట్లు రాము వెల్లడించారు. కేబుల్ రంగ భవిష్యత్ కు బాటలు వేసేలా ఎక్స్ ఫోను నిర్వహిస్తున్నామని తెలిపారు. డిజిటలైజేషన్ వల్ల తగ్గిన ఆదాయాన్నిపెంపొందించుకునేందుకు అవకాశం ఉన్న మార్గాల అన్వేశిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *